కీళ్ళవాతం తగ్గించే ఆహారాలు ఇవే.. తెలుసుకోండి!

వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది కీళ్ళ వాతంతో బాధ పడుతున్నారు. మన జీవన శైలి, శారీరక శ్రమ లేకపోవటం వంటి అనేక కారణాలు మనలను కీళ్ళ వ్యాధుల గ్రస్తులను చేస్తున్నాయి. అయితే కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు దీని నుండి ఉపశమనం పొందాలంటే ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కీళ్ళవాతానికి సూపర్ గా పని చేసే ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కీళ్ళవాతం తగ్గించే ఆహారాలు
కీళ్ల నొప్పులను తగ్గించే ఆహారాలలో మనం ఆకు కూరలను చెప్పుకోవచ్చు. ఆకు కూరలు కీళ్ళ నొప్పుల నుండి మనకు ఉపశమనం కలిగిస్తాయి. మన ఎముకలను బలోపేతం చేస్తాయి. ఇక పప్పులు, ధాన్యాలు కూడా కీళ్ళ నొప్పులను తగ్గించటంలో కీలకంగా పని చేస్తాయి. పప్పులు, ధాన్యాలలో అధికంగా ప్రోటీన్లు, ఫైబర్ ఉండటం వలన ఇవి కండరాలకు కావలసిన పోషకాలను అందిస్తాయి. వాటి పనితీరు మెరుగుగా ఉండేలా చేసి వాపులు, నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

These are the foods that reduce arthritis Know full details

కీళ్ళనొప్పులు తగ్గే ఆహారాలలో చేపలు
ఇక కీళ్ళ వాతం తగ్గాలంటే, కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలగాలంటే చేపలు ఎంతో బాగా పని చేస్తాయి. సాల్మన్ సార్డినెస్, మాకేరెల్, ట్యూనా చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉండడం వల్ల ఇవి జాయింట్ పెయిన్స్ ను తగ్గిస్తాయి. ఈ చేపలు తింటే కాస్త కీళ్ళ వాతం నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇవి తింటే కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం
కీళ్ళ వాతంతో బాధ పడేవారు ముఖ్యంగా చికెన్, మటన్ తక్కువ తింటే మంచిది. అంతేకాదు దుంప కూరలు, పులుసు కూరలు తక్కువ తినాలి. ఇక కీళ్ళ వాతంతో బాధ పడేవారు బెర్రీలు ఎక్కువ తినాలి. స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీలు, బ్లూబెర్రీల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను వాపులను తగ్గిస్తాయి.

వీటిని తింటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి
కీళ్ల నొప్పులను తగ్గించే వాటిలో డ్రై ఫ్రూట్స్ చాలా బాగా పని చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషకాలు యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉండటం కారణంగా ఇవి మన కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయి. అంతేకాదు కండరాలు, ఎముకల బలానికి కావాల్సిన పోషకాలను ఇస్తాయి.

ఆహారంలో వీటిని తీసుకుంటే కీళ్ళవాతం ఉన్నవారికి మేలు
కీళ్ళ వాతం తగ్గటానికి పసుపు కూడా చాలా ఉపయోగపడుతుంది. పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో పాటు వాపును తగ్గించే లక్షణాలు కలిగి ఉంటుంది. కీళ్లనొప్పి, కండరాలు పట్టేయడం, వాపులను తగ్గించడంలో ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇక కీళ్ళ నొప్పులను తగ్గించటంలో అల్లం కూడా కీలకంగా ఉపయోగపడుతుంది. కీళ్ళ వాతం ఉన్నవారు ఆహారాలలో విషయంలో జాగ్రత్త తీసుకుంటే కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. .

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+