ఉదయాన్నే వాము వాటర్ తాగితే శరీరంలో జరిగే మార్పులివే!

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యం కోసం ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలని భావించేవారు ఏం తీసుకోవాలి? ఏం తీసుకోకూడదు? అన్న దానిపైన దృష్టి పెడుతున్నారు. ఉదయాన్నే వాము వాటర్ తీసుకుంటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, శరీరంలో మార్పులు జరుగుతాయని గుర్తించారు.

వాము వాటర్ తో ఆరోగ్య ప్రయోజనాలు
వాములో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వాము వాటర్ ను తీసుకుంటే శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, కఫం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు వాము నీటిని తాగడం వల్ల వాటి నుంచి ఉపశమనాన్ని పొందుతారు. ఇక వాము పొడిని చేసుకునే ఆ పొడిని గోరువెచ్చని నీళ్లలో కలుపుకొని తాగితే కూడా మంచి ప్రయోజనాలే ఉంటాయి.

These are the health benefits with ajwain water intake in the morning

వాము వాటర్ తో ఈ సమస్యలకు చెక్
వాము వాటర్ ను తాగడం వల్ల మన జీర్ణ సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉంటాం. వాము నీరు తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యను అధిగమించవచ్చు. వాము బరువు తగ్గడానికి కూడా బాగా దోహదం చేస్తుంది. ఒక గ్లాసు నీళ్లలో రాత్రంతా వామును నానబెట్టి ఉదయం అందులో ఒక టీ స్పూన్ తేనె వేసి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

వాముతో పంటి ఆరోగ్యం
వాము పొడిని గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. నోటి దుర్వాసన కూడా మాయమవుతుంది. ఇంకా గర్భవతులైన మహిళలకు, పాలిచ్చే తల్లులకు కూడా వాము ఎంతగానో ఉపయోగపడుతుంది. గర్భిణీలకు సాధారణంగా ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తి వంటి వాటిని వాము దూరం చేస్తుంది.

వాముతో హైబీపీ, ఆర్థరైటిస్ నియంత్రణ
కప్పున్నర నీళ్లలో వామును వేసి మరిగించి కప్పు నీళ్లు అయ్యేవరకు ఉంచి ఫిల్టర్ చేసి తాగితే కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. వాము రక్తపోటును నియంత్రిస్తుంది. ఆర్థరైటిస్ సమస్యలను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ సమస్యలను పరిష్కరిస్తుంది. ఇన్ని మంచి గుణాలు ఉన్న వాము వాటర్ ను ప్రతినిత్యం ఉదయం పూట ఒక గ్లాసు తాగండి. ఆపై ఏం జరుగుతుందో మీరే చూడండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+