బాగా పాలిష్ పెట్టిన బియ్యంతో ఈ తీవ్రమైన వ్యాధి.. జాగ్రత్త!
మనం పాలిష్ చేసిన బియ్యంతో వండిన అన్నాన్ని తింటున్నాం. ఇక అసలే బియ్యం పాలిష్ చేసి ఉంటే దానిని మరింత గట్టిగా పిసికి పిసికి నీళ్లతో కడుగుతున్నాము. దీంతో బియ్యంలో ఉండే థయామిన్ పోతుంది. దీనివల్ల విటమిన్ బి1 లోపం వస్తుంది. ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఇది బెరిబెరి వ్యాధి రావడానికి కారణమవుతుంది.
బెరిబెరి వ్యాధి వచ్చేది ఇందుకే
బెరిబెరి అనేది విటమిన్ బి1 లోపం వల్ల వచ్చే ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది మన శరీరంలోని గుండెను మరియు నాడీ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఇందులో తడి బెరిబెరి, పొడి బెరిబెరి అని రెండు రకాలు ఉంటాయి. ముఖ్యంగా తడి బెరిబెరి గుండె మరియు రక్త ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన సమయాలలో ఇది గుండె ఆగిపోవడానికి కూడా కారణమవుతుంది.

ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త
గుండె పనితీరులో మార్పులు, శ్వాస ఆడక పోవడం వంటి లక్షణాలు ప్రధానంగా దీనితో కనిపిస్తాయి. ఇక పొడి బెరిబెరి శరీరంలోని నరాలను, కండరాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల కండరాల బలహీనత, నరాల నష్టం, నడకలో ఇబ్బంది, స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చేతులు, కాళ్ళల్లో తిమ్మిర్లు రావడంతో పాటు నడకలో ఇబ్బంది, మానసిక గందరగోళం, మాటలు తడబడడం వంటి లక్షణాలు పొడి బెరిబెరి వ్యాధిలో కనిపిస్తాయి.
ఈ చర్యలతోనే బెరిబెరి వ్యాధి
అసలు ఈ తడి బెరిబెరి, పొడి బెరిబెరి ఎందువల్ల వస్తాయి? కారణాలు ఏమిటి.. అంటే ముఖ్యంగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల, దయా అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అంతేకాదు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలోనూ ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఇవి మాత్రమే కాకుండా థయామిన్ తీసుకోలేని జన్యుపరమైన సమస్యలు శరీరానికి ఉంటే కూడా ఈ వ్యాధి వస్తుంది.
పెరుగుతున్న బెరిబెరి కేసులు
పాలిచ్చే తల్లులకు ఆహారంలో థయామిన్ లోపం ఉండడం వల్ల శిశువులకు ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో మళ్ళీ బెరిబెరి కేసులు పెరుగుతున్నాయి. కనుక వైద్యులు దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించాలి . కంప్లీట్ గా పాలిష్ పెట్టిన బియ్యం తినకుండా, బియ్యంలో థయామిన్ ఉండేలా చూసుకోవాలి. తక్కువ పాలిష్ చేసిన దంపుడు బియ్యాన్ని తినడం మంచిది.
రేషన్ షాపుల్లో ఇచ్చే ఫోర్టిఫైడ్ బియ్యం తిన్నా దీనికి చెక్
ఇక ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న పోషకాలున్న ఫోర్టిఫైడ్ బియ్యం తిన్నా కూడా మంచిదే మన తెలుగు రాష్ట్రాలలో గోదావరి జిల్లాలలోనూ, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలోనూ ఈ బెరిబెరి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి కనుక ఈ వ్యాధి విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం ఆహారంలో థయామిన్ ఉండేలా చూసుకోవడం చాలా అవసరం.
-
మళ్లీ మళ్లీ తినాలనిపించే "పీతల బిర్యానీ" ఎలా చేయాలంటే..? -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications