టమాటా ఎగ్ మసాలా కర్రీ.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవల్
కోడిగుడ్డుతో కూరలను రకరకాలుగా మనం వండుకుంటూ ఉంటాం. కోడిగుడ్డులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అటువంటి కోడిగుడ్డును టమాటాలతో కలిపి మసాలా వేసి వండితే ఆ రుచే వేరుగా ఉంటుంది. ఈరోజు మనం టమాటా ఎగ్ మసాలా కర్రీ ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
టమాటాలు- అరకిలో
కోడిగుడ్లు- 5
ఉల్లిపాయ- ఒకటి
పచ్చిమిరపకాయలు- నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్
పసుపు- పావు స్పూన్
ఉప్పు- రెండు స్పూన్లు
కారం- రెండు స్పూన్లు
గరం మసాల- ఒక స్పూన్
పోపు గింజలు- ఒక స్పూన్
కొత్తిమీర- కొద్దిగా
ధనియాల పొడి- ఒక స్పూన్
నూనె- మూడు స్పూన్లు

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టి అందులో మూడు స్పూన్ల నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత పోపు గింజలు వేసి, ఆపై అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేవరకు వేపుకోవాలి. ఆ తర్వాత అందులో ఐదు కోడిగుడ్లను పగలగొట్టి పొయ్యాలి.
ఇందులో మసాలా వేస్తే ఆ రుచే వేరు
కోడిగుడ్డు సొన మొత్తం ఉడికిపోయేవరకు నిదానంగా తిప్పుతూ వేయించుకోవాలి. కోడిగుడ్డు మొత్తం ముక్కలు ముక్కలుగా ఉడికిన తర్వాత అందులో పావు స్పూన్ పసుపు, రెండు స్పూన్ల ఉప్పు, రెండు స్పూన్ల కారం వేయాలి. ఆపై అందులో టమాటాలు వేసి బాగా కలిపి మూతపెట్టి టమాటా మొత్తం మగ్గేలా ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక స్పూన్ గరంమసాలా యాడ్ చేసి టమాటా మొత్తం ఉడికేలా సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి.
ఇలా వండుకుని ట్రై చెయ్యండి
చివరగా ధనియాల పొడి కొత్తిమీర వేసి కలిపి రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఈ టమాటా ఎగ్ మసాలా కర్రీ అన్నంలోకి కాదు రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం ఇలా వండుకుని ఒకసారి ట్రై చేయండి.












Click it and Unblock the Notifications