అధిక రక్తపోటును తగ్గించే ఆహారాలు.. ట్రై చెయ్యండి!
ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య హైబీపీ. ప్రపంచంలో సగానికి పైగా జనం హైబీపీతో బాధపడుతున్నారు. మన జీవనశైలి విధానం, విపరీతమైన పని ఒత్తిడి, మన ఆహారపు అలవాట్లు వెరసి చాలామంది హై బీపీ బారిన పడుతున్నారు. హై బీపీ కారణంగా గుండె జబ్బులు, మూత్రపిండాలు దెబ్బ తినడం, పక్షవాతం వంటి అనేక సమస్యలతో ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు.
హై బీపీ ఉన్నవారు జాగ్రత్త
ఇక హై బీపీ ని తగ్గించుకొని నార్మల్ గా జీవించాలంటే డాక్టర్లు సూచించిన మందులు వాడడంతో పాటు మన జీవనశైలిని కచ్చితంగా మార్చుకోవాలి. హైబీపీ ని కంట్రోల్ చేసుకోవడానికి మన ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. మరి హై బీపీ ఉన్నవారు ఆహారం విషయంలో మార్చుకోవాల్సిందేమిటి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

హై బీపీ తగ్గించే ఆహారాలు
హై బీపీ తో బాధపడేవారు ఉప్పు, కారాన్ని చాలా తక్కువ తినాలి. మసాలా ఫుడ్ కూడా ఎక్కువ తినకూడదు. హై బీపీ ఉన్నవారు బీపీ కంట్రోల్ లో ఉంచుకోవాలంటే ఆహార నియమాలను తప్పనిసరిగా పాటించాలి. బీపీని కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడే కొన్ని ఆహారాలను తినడం ఎంతో మంచిది.
పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాలతో బీపీ కంట్రోల్
ఇక అటువంటి ఆహారాలలో పండ్లు కీలక భూమిక పోషిస్తాయి. అరటి పండ్లు కివి పండ్లు బ్లూబెర్రీ, బత్తాయిలు, కమలాలు, నారింజ పండ్లు, అవకాడో, బీట్రూట్, పాలకూర, వైట్ బీన్స్, వెల్లుల్లి, సాల్మన్ చేప, ఓట్స్ ఇలా అనేక ఆహారాలు మన హైబీపీని నియంత్రించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. పొటాషియం ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకుంటే మన బీపీ కంట్రోల్ లోకి వస్తుంది.
రక్తపోటును నియంత్రించడానికి ఇవి తీసుకోండి
ఇక పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలైన పుచ్చకాయలు, ఆప్రికాట్లు తినడం కూడా ఎంతో మంచిది. ఇవి కూడా మన రక్తపోటును నియంత్రించడానికి దోహదం చేస్తాయి. ప్రతిరోజు ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగితే బీపీ నియంత్రణలోకి వస్తుంది. ఇక ఓట్స్ లోను మన బీపీని నియంత్రించే పోషకాలు ఉన్నాయి.
ఈ పదార్ధాలలోనూ బీపీ కంట్రోల్ చేసే పోషకాలు
ఓట్స్ లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఇది సిస్టాలిక్, డయస్టాలిక్ రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఐబీపీతో బాధపడేవారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు వహిస్తూ, పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని తీసుకోవడం ఉత్తమం ఇక పెరుగు, తేనె కూడా మన బీపీని నియంత్రించడానికి దోహదం చేస్తాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications