ఈ టేస్టీ సలాడ్స్ ట్రై చెయ్యండి.. మీ ఆరోగ్య అద్భుతాలు ఎంజాయ్ చెయ్యండి!
ప్రస్తుతం సమాజంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక బరువు తగ్గడం కోసం సలాడ్లు తింటున్నారు. అయితే ప్రతిరోజు ఒకే విధమైన కూరగాయలను, ఆకుకూరలను కట్ చేసుకుని తినే సలాడ్లు టేస్టీగా అనిపించవు. అందుకే ఆరోగ్యాన్ని ఇచ్చే మన బరువును ఈజీగా తగ్గించుకునే కొన్ని రకాల సలాడ్లను మనం ఎలా తయారు చేసుకోవచ్చో అవి ఏ విధంగా మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
టేస్టీ సలాడ్ లు.. హెల్త్ బెనిఫిట్స్
బరువు తగ్గడం కోసం చాలామంది కూరగాయలతో కూడిన సలాడ్లు తింటారు. ఇది మేలు చేస్తుంది. అయినప్పటికీ వాటిల్లో కొన్ని రకాల ఆహారాలను కలుపుకోవడం వల్ల అది మరింత టేస్టీగాను మనకు వెయిట్ లాస్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మన బరువును తగ్గించి మన వెయిట్ లాస్ కు ఉపయోగపడే ఆ పదార్థాలు సలాడ్స్ లో యాడ్ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.

సలాడ్స్ ఇలా తింటే ఆరోగ్యం
తృణధాన్యాలను, ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి వాటిని ఉడికించి సలాడ్స్ లో యాడ్ చేసుకోవచ్చు . వీటిలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి .ఫైబర్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. బాదం, అక్రోట్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, నట్స్ యాడ్ చేసుకోవచ్చు. వీటిల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి.
ఈజీగా బరువు తగ్గించే టేస్టీ సలాడ్ లు
సలాడ్స్ లో పాలకూర, తోటకూర, బచ్చలి కూర వంట ఆకుకూరలను కాస్త ఉడికించి యాడ్ చేసుకుని తినవచ్చు. వీటివల్ల ఫైబర్, మినరల్స్ బాగా మన శరీరానికి అందుతాయి. ఈజీగా బరువు తగ్గడానికి కూడా ఇవి దోహదం చేస్తాయి. అంతేకాదు అరటి, యాపిల్, ఆరెంజ్, బెర్రీలు వంటి పండ్లను కూడా సలాడ్స్ లో యాడ్ చేసుకోవచ్చు. వీటిని తింటే మన శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా దొరుకుతాయి.
ఆరోగ్యంగా , ఫిట్ గా ఉండడానికి ఈ ఆహారాలు
బరువు తగ్గేందుకు ఇవి దోహదం చేస్తాయి. సలాడ్స్ లో బీన్స్ ,సెనగలు, ఉడికించిన పప్పు ధాన్యాలు, కాయ ధాన్యాలు వేసుకొని తినవచ్చు. వీటివల్ల ప్రోటీన్, ఫైబర్ శరీరానికి బాగా అందుతాయి. ఇవి కూడా మన బరువును తగ్గించడానికి బాగా దోహదం చేస్తాయి. అంతేకాదు మనం ఆరోగ్యంగా , ఫిట్ గా ఉండడానికి ఈ ఆహారాలు ఉపయోగపడతాయి. కాబట్టి నార్మల్ సలాడ్స్ కాకుండా ఇలా కొన్ని టేస్టీ టేస్టీ డిఫరెంట్ సలాడ్స్ ను ట్రై చేయండి. ఈజీగా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉండండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications