పరగడుపున నిమ్మరసం తాగే వారికి హెచ్చరిక!
నిమ్మరసం.. మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుందని చాలామంది వైద్య నిపుణులు చెబుతారు. ఇక ఉదయం పరగడుపున కాస్త నిమ్మరసం తేనె గోరువెచ్చని నీళ్లలో కలుపుకొని తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని కూడా చెబుతారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నిమ్మరసాన్ని తాగడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్యలతో నిమ్మరసం తాగటం మంచిది కాదు
కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఉదయం నిమ్మరసం తాగితే ఆ అనారోగ్య సమస్యల తీవ్రత పెరుగుతుంది అని చెప్తున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నిమ్మరసాన్ని తాగకూడదు అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. విపరీతమైన ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు, జీర్ణ సమస్యలతో బాధ పడుతున్న వారు ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తేనే తాగడం మంచిది కాదు.

దంతాల ఆరోగ్యం కావాలంటే నో నిమ్మరసం
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల మన పొట్టలో యాసిడ్ మరింత పెరిగి అది మన జీర్ణ వ్యవస్థ పైన విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు . అంతేకాదు ఖాళీ కడుపుతో నిమ్మరసం తేనె తాగడం వల్ల దంతాలు సెన్సిటివ్ గా మారుతాయి అని నిమ్మరసంలో ఉండే పులుపుదనం దంతాలపై ఉన్న ఎనామిల్ ను నాశనం చేసి మనకు దంత సంబంధిత సమస్యలు వచ్చేలా చేస్తుందని చెబుతున్నారు.
ఈ వ్యాధులు ఉన్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండాలి
నిమ్మరసం తాగడం వల్ల బోలు ఎముకల సమస్య వస్తుందని హెచ్చరిస్తున్నారు. నిమ్మరసం తాగడం వల్ల హార్ట్ బర్న్ సమస్యతో పాటు, పెప్టిక్ అల్సర్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఎవరైతే కిడ్నీ వ్యాధులతో బాధపడతారో అటువంటి వారు ఉదయాన్నే నిమ్మరసం తాగకూడదని, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడేవారు నిమ్మరసానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ సమస్యలతో ఉన్నవారు జాగ్రత్త
ఇక మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు కూడా నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. కనుక ఈ సమస్యలతో బాధపడేవారు పొద్దున్నే పరగడుపున నిమ్మరసం తాగడాన్ని మానుకోవాలి. లేదంటే సమస్యల తీవ్రత పెరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ అనారోగ్య సమస్యలు లేకున్నా సరే ఉదయం నిమ్మరసం తాగాలని అనుకుంటే కొద్ది మంచినీరు మొదట తాగిన తర్వాత నిమ్మరసం తాగటం మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications