year ender 2024: ఈ ఏడాది టాప్ ఫిట్నెస్ ట్రెండ్స్ ఇవే!
2024 సంవత్సరంలో చాలామంది శరీర ఆరోగ్యం పైన దృష్టి సారించారు. ఫిట్నెస్ విషయంలో బాగానే ఫోకస్ చేశారు. ఇక 2024 సంవత్సరంలో టాప్ లో ట్రెండ్ అయిన ఫిట్నెస్ ట్రెండ్స్ ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో చాలామంది అనేక ఫిట్నెస్ చాలెంజ్ లను స్వీకరించారు.
10కే వాకెథాన్, వర్చువల్ వర్కౌట్స్
2024 లో ప్రతిరోజు 10,000 అడుగులు వేయడం ఒక ఫిట్నెస్ ఛాలెంజ్. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించిన చాలామంది పదివేల అడుగులు వేయడానికి ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ ను స్వీకరించి వాకెథాన్ నిర్వహించడానికి ఆసక్తి చూపించారు. ఇక 2024 సంవత్సరంలో చాలామంది వర్చువల్ వర్కౌట్స్ విషయంలో కూడా ఆసక్తి కనబరిచారు. ఇది కూడా 2024 ఫిట్నెస్ ఛాలెంజ్ లో భాగమైంది.

మైక్రో వర్కౌట్స్
ఇక 2024 సంవత్సరంలో కేవలం ఐదు నిమిషాల్లోనే చేయగలిగిన చిన్న చిన్న ఎక్ససైజ్ ల పైన కూడా బాగా ఫోకస్ చేశారు, ఈ మైక్రో వర్కౌట్స్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో భాగమైంది. బిజీ షెడ్యూల్ లో పనిచేసే చాలా మంది రోజుల వారికి కుదిరినప్పుడల్లా ఈ మైక్రో వర్కౌట్స్ ను చేశారు.
డైట్ , స్త్రెంత్ ట్రైనింగ్
ఇక 2024 లో ఫిట్నెస్ తో పాటు పోషకాహారం పైన కూడా ఎక్కువ ఫోకస్ చేశారు. ఇది కూడా 2024 ఫిట్నెస్ ట్రెండ్ లో భాగమైంది. చాలామంది స్ట్రెంత్ ట్రైనింగ్ పైన ఫోకస్ పెట్టారు. స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుందని భావించిన చాలామంది 2024లో దీనిపైన కూడా ఎక్కువ శ్రద్ధ చూపించారు.
లో ఇంపాక్ట్ వర్కౌట్స్
ఇక కెటిల్ బెల్ స్వింగ్స్ వంటి ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ కూడా 2024 ఫిట్నెస్ ట్రెండ్ లో భాగంగా మారాయి. లో ఇంపాక్ట్ వర్కౌట్ కూడా ఈ సంవత్సరం బాగా పాపులర్ అయింది. ఎటువంటి గాయాలకు అవకాశాలు లేనటువంటి ఈ రకమైన వర్కౌట్లు 2024 లో బాగానే పాపులర్ అయ్యాయి.
ఫిట్నెస్ ట్రాకర్లు, స్మార్ట్ వాచ్ లు
2024 లో ఫిట్నెస్ పైన ఫోకస్ చేసిన జనాలు ఫిట్నెస్ ట్రాకర్లను, స్మార్ట్ వాచ్ లను బాగా ఎక్కువగా ఉపయోగించారు. ఇది కూడా ఫిట్నెస్ ఛాలెంజ్ లో ఒక భాగంగా మారింది. మొత్తంగా ఈ సంవత్సరం జనాలు అందరూ ఫిట్నెస్ పైన బాగానే కష్టపడ్డారని ఈ ఫిట్నెస్ ట్రెండ్స్ చెప్తున్నాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications