• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

IBM Recuritment : గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్‌కు మంచి అవకాశం... ఐబీఎంలో జాబ్ ఆఫర్స్...

|

అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్(IBM) అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది.ఈ పోస్టులు గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్‌తో భర్తీ చేయనున్నారు. భారత్‌లోని ముంబై,పుణే,ఢిల్లీ ఎన్‌సీఆర్,కోల్‌కతా,చెన్నై,హైదరాబాద్,బెంగళూరు నగరాల్లోని ఐబీఎం కార్యాలయాల్లో రిక్రూట్‌మెంట్స్ జరగనున్నాయి.

ఎంట్రీ లెవల్ జాబ్ :

ఎంట్రీ లెవల్ జాబ్ :

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా వివిధ విభాగాల్లో ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకోనున్నారు. అప్లికేషన్స్ డిజైనింగ్,రైటింగ్,టెస్టింగ్,డీబగ్గింగ్ కోడ్స్,వివిధ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్స్‌పై వర్క్,తదితర రోల్స్‌లో వారిని రిక్రూట్ చేస్తారు.జాబ్‌కు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఐబీఎంలో జాబ్‌కి అర్హత :

ఐబీఎంలో జాబ్‌కి అర్హత :

అభ్యర్థులకు జావా,పైథాన్,నోడ్.జేస్ వంటి కోడ్ లాంగ్వేజ్‌లు తెలిసి ఉండాలి.లైఫ్ సైకిల్ కాన్సెప్టుకు సంబంధించి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌పై స్పష్టమైన అవగాహన ఉండాలి. అభ్యర్థులు బీఈ/బీటెక్/ఎంటెక్ లేదా ఎమ్మెస్సీ,ఎంసీఏ,కంప్యూటర్ సైన్స్,ఐటీ కోర్సులు చదివి ఉండాలి.బీటెక్ లేదా టెక్నికల్ డిగ్రీ కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.అయితే ఐబీఎంలో ఉద్యోగం సాధించే నాటికి వారు గ్రాడ్యుయేట్ హోల్డర్స్‌గా ఉండాలి. లేనిపక్షంలో జాబ్ ఆఫర్ తిరస్కరించబడుతుంది.

విద్యార్హతతో పాటు ఉండాల్సిన టెక్నికల్ స్కిల్స్ :

విద్యార్హతతో పాటు ఉండాల్సిన టెక్నికల్ స్కిల్స్ :

ఐబీఎంలో పనిచేయాలనుకునే ఔత్సాహికులైన అభ్యర్థులకు విద్యార్హతతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. టెక్నికల్ ఆర్కిటెక్చర్‌ను సమీక్షించడం,ఐటీపై మంచి పట్టు,ప్రాజెక్టును ఇండిపెండెంట్‌గా డీల్ చేయగలిగే టాలెంట్ అవసరం.టెక్నికల్ కన్సల్టెంట్స్,టీమ్ లీడ్స్‌తో కలిసి సమన్వయం చేసుకోవాలి.

ఇదిలా ఉంటే,రెండు నెలల క్రితం బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అథారిటీతో ఐబీఎం పదేళ్ల కాలానికి పార్ట్‌నర్‌షిప్ డీల్ కుదర్చుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఐబీఎం సంస్థ కెంపెగౌడ విమానాశ్రయానికి ఐటీ సొల్యూషన్స్ అందిస్తుంది. ఇందుకోసం 'ఎయిర్‌పోర్ట్ ఇన్ ఏ బాక్స్' అనే ప్రాజెక్టును చేపడుతోంది.

English summary
US-based IT giant International Business Machine (IBM) has announced a recruitment drive for Associate System Engineer posts. These posts will be filled with graduate freshers. Recruitment will take place at IBM offices in Mumbai, Pune, Delhi NCR, Kolkata, Chennai, Hyderabad and Bangalore, India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X