రెండో రోజు ఆడితే చూద్దాం...
బెర్నాడ్ షా ఓ సారి సెంకండ్ హ్యాండ్ షాప్ కి వెళ్లి పుస్తకాలు తిరిగేస్తూంటే...అందులో తను రాసిన పుస్తకం కనపడింది. ఆశ్చర్యంగా చూసాడాయన
'ఫలానావారికి.. అభినందనలతో బెర్నాడ్ షా' అని పుస్తకం మొదటి పేజిలో రాసి తన సంతకం ఉంది...
వెంటనే ఆయన ఆ పుస్తకం కొని మళ్లీ అదే వ్యక్తికి 'మళ్లీ అభినందనలతో...' బెర్నాడ్ షా అని రాసి పంపించాడు.
-------------
తన నాటకం ప్రదర్శించే రోజున బెర్నాడ్ షా...చర్చిల్ కి రెండు టిక్కెట్లు పంపించాడు. ఆ టిక్కెట్లతో పాటు ఓ చిన్న ఉత్తరం కూడా రాసాడు.
"నా నాటకం తిలకించేందుకుగానూ మీకు రెండు టిక్కెట్లు పంపుతున్నాను..ఒకటి మీకు..రెండోది మీ స్నేహితుడుకి..మీకు స్నేహితుడంటూ ఒకరుంటే..."
చర్చిల్ వెంటనే జవాబు రాసి పంపించాడు
"మీ నాటకానికి మొదటి రోజు రావటం సాధ్యం కాదు..రెండో రోజు వస్తాను..రెండో రోజు అది ప్రదర్శించబడేటట్లయితే..."












Click it and Unblock the Notifications