కుక్కలూ ఎక్కేశాయి...
ఉదయాన్నే తన కారులో బయిలుదేరిన ఓ పెద్ద మనిషికి పరుగెత్తే ఒకతను,అతని వెనకపడ్డ భయంకరంగా కనిపించే మూడు అల్సేసియన్ కుక్కలు కనిపించాయి.
పెద్ద మనిషికి పాపం జాలేసింది. అతని ప్రక్కన కారాపి, డోర్ తెరిచి... "త్వరగా ఎక్కండి" చెప్పాడు.
"థాంక్సండి... నా పెంపుడు కుక్కలను చూసి ఎవరని అడిగినా కారాపి లిప్ట్ ఇవ్వటం లేదు..." అన్నాడు
ఈలోగా పొలోమంటూ ఆ కుక్కలు వచ్చి కారు ఎక్కేసాయి.
----------------
తన ప్రెండ్ కి బిడ్డ పుట్టిందని తెలిసి సుబ్బారావు అడిగాడు
"ఎంత వయస్సు?"
"ఎనిమిది నెలలు"
"మాటలొచ్చాయా?"
"ఇంకా లేదు"
"అయితే మగబిడ్డ అన్నమాట..."
తేల్చేసాడు...












Click it and Unblock the Notifications