లవ్ లెటర్ అతనికిస్తావా....
"నీ మీద ఉన్న మర్డర్ కేసు కొట్టేశారు కదా.. మళ్లీ జైలుకు ఎందుకు వచ్చావు" అడిగాడు ఖైదీ రంగడు.
"మర్డర్ కేసులో నా తరఫున వాదించిన లాయర్ ముందు మాట్లాడుకున్న దాని కన్నా ఐదింతలు ఎక్కువ అడిగాడు... దాంతో అతన్ని లేపేశా..." చెప్పాడు సుబ్బులు
.... ..... ...
"రామూ... నా మీద నీకు ప్రేమ ఉందా..." అడిగింది రాధ.
"లేకేమిటీ.. నువ్వంటే నాకు ప్రాణం..." చెప్పాడు రాము.
"అయితే.. నేను చేయమన్నది చేస్తావా..."
"చేయకేం... గంగలో దూకమంటే దూకుతా..."
"అంత వద్దులే గానీ... ఈ లవ్ లెటర్ తీసుకెళ్లి మోహన్‌కిస్తావా.." అసలు విషయం చల్లగా చెప్పింది రాధ












Click it and Unblock the Notifications