అతనికి అందరూ తెలుసు...
ఏరా, ఐదేళ్లవుతోంది హైదరాబాదుకు వచ్చి, ఇంకా ఒక సినిమాలో కూడా చాన్స్ రాలేదా అడిగాడు ఊరి నుంచి వచ్చిన మిత్రుడు శ్యాం రామును.
రాలేదురా అని చెప్పాడు నిరాశగా రాము
నీకెవరూ తెలియదా, సినిమా ఫీల్డ్‌లో... అడిగాడు శ్యాం
తెలియకేం, చాలా మంది తెలుసు... చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అంతా తెలుసు... హీరోయిన్లు కూడా తెలుసు చెప్పాడు రాము.
అంత మంది తెలిసి ఉండి, సినిమా చాన్స్ ఎందుకు సంపాదించలేకపోయావురా అడిగాడు అమాయకంగా శ్యాం
నాకు వాళ్లు తెలుసునని చెప్పా గానీ నేను వాళ్లకి తెలుసునని చెప్పలేదు కదా అన్నాడు రాము.












Click it and Unblock the Notifications