ఏడాది పెద్దయితే, ఏడాది తర్వాతే...
వైమానిక సిబ్బందికి శిక్షణ ఇచ్చే టూ సీటర్ ఎయర్ క్రాప్ట్ ఓ స్మశాన వాటికలో కూలిపోయింది. మిస్టర్ తింగరి తన సహచరులతో అక్కడ త్రవ్వకాలు జరిపి వంద మృతదేహాలు దాకా వెలికితీసాడు. తవ్వకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
పోయింది ఇద్దరైనా...ఇన్ని శవాలు ఎలా బయిటకు వస్తున్నాయో తింగరికి ఎప్పుడూ డౌట్ రాలేదు.
----------------
మిస్టర్ తింగరి నానా కష్టాలు పడి మొత్తానికి ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కోసం ఏదైనా చెయ్యటానికి రెడీ అయ్యాడు. ఓ రోజు ఆమెను కలిసి మొదట తన లవ్ ప్రపోజల్ బయిటపెట్టాడు.
తింగరి... "కుమారీ ఐ లవ్ యూ" అన్నాడు
కుమారి "నేను నీ కంటే ఏడాది పెద్దదాన్ని తెలుసా?" అని చెప్పింది.
తింగరి... "నో ప్లాబ్లం... మనం ఏడాది తర్వాతే పెళ్లి చేసుకుందాం.." అంటూ ఆ సమస్యకు పరిష్కారం చూపాడు... తర్వాత ఆమె అక్కడ నుంచి కాస్సెపటికి నవ్వుకుంటూ వెళ్లిపోయింది.
ఆమె అతని ప్రేమను ఏక్సెప్టు చేసిందా లేదా అన్నది ఇంకా అతనికి సస్పెన్స్ గానే ఉంది.












Click it and Unblock the Notifications