ఫెయిలతే అతనికి పెళ్లంట..
పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత ఇద్దరు మిత్రులు గుడికి వచ్చారు. దేవుడికి మొక్కుకున్నారు.
మొదటి మిత్రుడు: దేవుడ్ని ఏం కోరుకున్నావురా..?
రెండో మిత్రుడు: పరీక్షల్లో ఫెయిల్ చేయమని..
మొదటి మిత్రుడు: అదేంటిరా..? అందరూ పాస్ చేయమని కోరుకుంటారు. నువ్వేమో..??
రెండో మిత్రుడు: ఫస్ట్ క్లాస్ వస్తే మా నాన్న బైక్ కొనిస్తానని అన్నాడు. మామూలుగా పాసైతే ల్యాప్‌టాప్ కొనిస్తానన్నాడు. ఫెయిలైతే పెళ్లి చేస్తానన్నాడు.. అందుకని..
మొదటి మిత్రుడు: పెళ్లి చేస్తానని అంటే ఏమిటో అర్థమైందా..
రెండో మిత్రుడు: వేరే అర్థం ఉందా..?
మొదటి మిత్రుడు: మెత్తగా తంతానని చెప్పడం...












Click it and Unblock the Notifications