కోరిక తీర్చాను అంతే!
జడ్జి - నీ భార్యను ఎందుకు చంపావు
వెంకట్రావు - ఆమె అంటే నాకు చచ్చేంత ప్రాణం. ఏది కావాలన్నా వెంటనే తీరుస్తాను. ఇప్పుడు కూడా ఆమె కోరికను తీర్చాను. పుణ్య స్త్రీగా పోవాలని కోరింది. అందుకే ఇలా చేశాను అని అమాయకంగా చెప్పాడు
----------------------------
అమాయకత్వం
రైల్వే స్టేషన్‌లో ఓ చోట కొందరి ఫోటోలు అతికించి వాటికింద జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాసి ఉంది. దానిని వెంగళప్ప చదివాడు. పక్కనే ఉన్న మిత్రుడితో..
వీళ్లంతా పిచ్చి దొంగల్లా ఉన్నారు. జేబులను తీసుకు వెళ్లి ఏం చేసుకుంటారు వీళ్లు అన్నాడు.
వెంగళప్ప మాటలు విని అశ్చర్యపోయాడు ఆయన మిత్రుడు
--------------------------
దేవుడు ప్రత్యక్షం కావొద్దు
చంటబ్బాయి - దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటావు
రత్నాకర్ - అప్సరసలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటాను సిగ్గుపడుతూ చెప్పాడు. మరి నువ్వేం కోరుకుంటావు అడిగాడు చంటబ్బాయిని.
చంటబ్బాయి - నీకు దేవుడు ప్రత్యక్షం కావొద్దని అకస్మాత్తుగా నోరు జారాడు












Click it and Unblock the Notifications