మార్క్ ట్వైన్ కొంటె జవాబు
ఓసారి మార్క్‌ట్వైన్ న్యూయార్కులో ఓ పేవ్‌మెంట్ మీంచి నడిచి వెడుతుంటే ఓ ముసలాయన ఎదురై
''బాబూ మీది క్లెమెన్స్ కుటుంబం కదూ?'' అన్నాడు.
‘‘అవునండీ!'' అన్నాడు మార్క్ ట్వైన్.
‘‘మీరిద్దరు కవలపిల్లలు అవునా?''
‘‘అవునండీ!'' చెప్పాడు మార్క్‌ట్వైన్.
‘‘మీ ఇద్దరిలోనూ ఆ మధ్యన ఒకడు చనిపోయాడు. ఆ చనిపోయింది వాడా? నువ్వా?'' అని అడిగాడా ముసలాయన.
‘‘చనిపోయింది నేనేనండి!'' అన్నాడు మార్క్‌ట్వైన్ కొంటెగా.
అంతే ఆ ముసలాయన పత్తాలేకుండా పారిపోయాడు.
-----------
ఓ మొగుడు పెళ్ళాం పోట్లాడుకుని మాట్లాడుకోవడం మానేశారు. మొగుడు మర్నాడు ఉదయం ఆఫీసు పని మీద క్యాంపు కి వెళ్ళాలి. అందుకని ' నన్ను తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్ర లేపు ' అని ఓ కాగితం మీద రాసి పెట్టి పడుకున్నాడు.
ప్రొద్దున్న ఏడింటికి మెలుకువ వచ్చిందాయనకి. కంగారుగా లేచి చూస్తే రాత్రి తాను పెట్టిన కాగితం పక్కనే ' నాలుగయింది. లేవండి ' అని రాసి వున్న కాగితం కనిపించింది.












Click it and Unblock the Notifications