బెత్తెడు జాగంటే ఎందుకు కోపం..
డిగ్రీ క్లాస్.. తెలుగు టీచర్ క్లాస్‌లోకి వచ్చాడు. అతనికి సురేష్ కనిపించాడు. చాలా రోజులుగా అతను క్లాస్‌కు రావడం లేదు..
చాలా రోజుల తర్వాత క్లాస్‌లో కనిపించేసరికి తెలుగు టీచర్ సురేష్‌ను ఉద్దేశించి - "ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు?" అని అడిగాడు.
"ఊరికెళ్లాను, సార్.." అని చెప్పాడు సురేష్
"క్లాస్ ఎగ్గొట్టి, ఊళ్లో చేసే ఘనకార్యం ఏముందో.." అన్నాడు టీచర్.
"పెళ్లి చేసుకున్నాను, సార్.." చెప్పాడు సురేష్
"అత్తగారు ఏమిచ్చారేమిటీ...?" అని ఆరా తీశాడు టీచర్
"బెత్తెడు జాగా ఇచ్చారు, సార్" అని చెప్పాడు.
తెలుగు టీచర్‌కు మండుకొచ్చింది. వెంటనే - "నువ్వే సాగు చేసుకోక, కౌలుకు ఎందుకు ఇచ్చి వచ్చావురా.." అని అడిగాడు.












Click it and Unblock the Notifications