పక్కవాడెవడో చేసి ఉంటాడు
జ్వరంగా ఉందని యూరిన్ టెస్ట్ చేయించుకోవటానికి వెళ్లాడు మన్మధరాజు.
ల్యాబ్ లోకి ఎంటర్ అవుతూండగా తన స్నేహితుడు కామరాజు ఏడుస్తూ ఎదురు వచ్చాడు.
"ఎందుకురా, ఏడుస్తున్నావు?" అన్నాడు మన్మధరాజు
"బ్లడ్ టెస్ట్ చేయాలని బొటన వేలు మీద సూది పెట్టుకుని పొడిచారురా..." అన్నాడు.
"అవునా....మరి నేను యూరిన్ టెస్ట్ కి వచ్చానురా..నా పరిస్ధితి ఏంటి...అని జంప్ అయిపోయాడు" మన్మధరాజు
-------------------------------------
వాంతులు చేసుకుంటున్న తన పడుచు పెళ్లాన్ని హాస్పటిల్ కి తీసుకెళ్లాడు ఎనభై ఏళ్ల లింగం మామ
డాక్టర్ టెస్ట్ చేసి... "కంగ్రాట్స్ ... మీరు తండ్రి కాబోతున్నారు" అని చెప్పాడు.
దానికి లింగం మామ.. "అవునా..ఈ వయస్సులో నేను తండ్రిని కావటం చాలా ఆశ్చర్యంగా ఉంది...డాక్టరు గారు.." అన్నాడు
దానికి డాక్టర్... "నేను చదువుకునే రోజుల్లో ఓ అడవిగుండా వెళ్తూండేవాడిని.. ఓ రోజు సడెన్ గా నా ఎదురుగా ఓ పులి వచ్చింది. నాకు ఏం చెయ్యాలో అర్దం కాలేదు..ప్రక్కనున్న కర్రను తీసుకుని కాల్చేసాను..పులి చచ్చిపోయింది.." అన్నాడు..
దానికి లింగం మామ.. "నేను నమ్మను...మీ కంటికి నేను మరీ అంత జప్పాలా నపడుతున్నానా... ప్రక్కనుంచి ఎవడో కాల్చేసి ఉంటాడు" అన్నాడు.
"మీ విషయంలో కూడా అలాంటిదే జరిగి ఉంటుంది..." అంటూ డాక్టర్ ప్రిస్కిప్షన్ ప్యాడ్ అందుకున్నాడు...












Click it and Unblock the Notifications