భగవంతుడి దయ వల్ల....
'నిన్న నాస్తిక మహా సభలకు వెళ్లి వచ్చావు కదా...ఎలా జరిగింది?' ఆసక్తిగా అడిగాడు సుబ్బారావు తన ప్రెండ్ సుబ్రమణ్యంని..
'భగవంతుడు దయవల్ల బాగా జరిగింది!!!' చెప్పాడు సుబ్రమణ్యం చాలా క్యాజువల్ గా...
--------------
'ఈ థియేటర్ లో ఏ సినిమా ఆడుతోంది బాబు?' అడిగాడు ఓ పల్లెటూరు ఆసామి ...అటుగా వెళ్లే ఓ స్టూడెంట్ ని ఆపి...
'దొంగ-దొంగ' చెప్పాడు స్టూడెంట్ పోస్టర్ మీద ఉన్న టైటిల్ ని చదివి
'ఆ థియేటర్ లో..?' అని ప్రక్కనే ఉన్న మరో థియేటర్ ని చూపి అడిగాడు...
'గోవిందా-గోవిందా' చెప్పాడు ఆ స్టూడెంట్ ఓపికగా...
'నాకేమన్నా చెముడు అనుకున్నావా... ఒకే పదాన్ని రెండు సార్లు చెపుతావేం?' కస్సుమన్నాడు...పల్లెటూరు ఆసామి.












Click it and Unblock the Notifications