నేడు అధిక పూర్ణిమ: అరుదైన యోగాలు; ఐశ్వర్యం, ఆరోగ్యం కోసం చెయ్యాల్సిందిదే!!
హిందూ పంచాంగం ప్రకారం అధిక శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమ అధిక పూర్ణిమ. ఈరోజు అధిక పూర్ణిమ తెల్లవారుజామున 3 గంటల 53 నిమిషాలకు ప్రారంభమై, ఆగస్టు 2వ తేదీ అర్ధరాత్రి 12 గంటల 20 నిమిషాలకు ముగుస్తుంది. ఫలితంగా శ్రావణ అధిక పూర్ణిమ వ్రతం నేడు చాలామంది ఆచరిస్తారు. అధిక శ్రావణమాసంలో తృతీయ మంగళ గౌరీ వ్రతాన్ని కూడా ఈరోజు ఆచరిస్తారు.
అధిక శ్రావణమాసంలో వచ్చిన అధిక పూర్ణిమలో అత్యంత పవిత్రమైన అరుదైన శుభ యోగాలు ఆవిర్భవిస్తాయి అని చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున పృథి యోగం, ఆయుష్మాన్ యోగం పుడతాయని, ఈ సమయాన్ని ఉత్తరాషాడ నక్షత్రం కూడా అనుగ్రహిస్తుందని చెబుతున్నారు. అయితే ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల 52 నిమిషాల వరకు పృథి యోగం ఉంటే, ఆ తర్వాత నుండి ఆయుష్మాన్ యోగం ప్రారంభమవుతుందని చెబుతున్నారు.

ఈరోజు వచ్చిన పూర్ణిమ తిథిలో చాలా ప్రత్యేకత ఉందని, ఇది శుభప్రదం అని చెబుతున్నారు. శ్రావణ అధిక పూర్ణిమ నాడు విష్ణువు,లక్ష్మీ మరియు చంద్రుని ఆరాధిస్తే శుభం జరుగుతుందని చెబుతున్నారు. ఆర్థిక సమస్యల నుండి బయట పడతారని ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.
ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే స్నానం చేయడం, భగవంతుడిని పూజించడం, వారికి దానం చేయడం వల్ల పుష్కలంగా పుణ్యఫలాలు లభిస్తాయని చెబుతున్నారు. కోరికలన్నీ నెరవేరుతాయని జీవితంలో సంతోషం, శ్రేయస్సు రెండు కలుగుతాయని చెబుతున్నారు. అధిక శ్రావణ పూర్ణిమ సందర్భంగా చంద్రుని పూజించటానికి రాత్రివేళ చంద్రునికి పాలు మరియు నీళ్లను సమర్పించాలని చెబుతున్నారు.
చంద్రునికి పాలను, నీళ్లను సమర్పించడానికి వెండి కాడ ఉపయోగించాలని, ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పాటించాలని చెబుతున్నారు. వీలైతే పూజించడం వల్ల వ్యక్తి అన్ని దోషాలు నుండి బయట పడతాడని జాతకంలో శుక్రుడు స్థానం బలపడుతుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications