త్వరలో హంసయోగం అందిస్తుంది వీరికి అఖండ ధనయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి. ముఖ్యంగా గజకేసరి యోగం, త్రిగ్రాహి యోగం, మాలవ్య యోగం వంటి యోగాలు అనేక రాశుల వారికి శుభాలను చేకూరుస్తున్నాయి. ఇక అటువంటి యోగాలలో హంస యోగం కూడా ఒకటి. హంసయోగంతో కొన్ని రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది. దేవగురువు బృహస్పతి దయవల్ల అద్భుతమైన హంసయోగం ఏర్పడుతుంది.
హంసయోగం.. అదృష్ట రాశులు
పంచ మహాపురుష యోగాలలో హంసయోగం ఒకటిగా పరిగణిస్తారు. హంసయోగం అనేది ధనుస్సు, కర్కాటకం, మీనరాశులలో లగ్నం నుండి కేంద్ర గృహాలలో ఒకటి, నాలుగు, ఏడు, పదవ గృహాలలో దేవ గురువు బృహస్పతి ఉన్నప్పుడు ఏర్పడుతుంది. హంసయోగం అత్యంత అరుదుగా ఏర్పడే యోగం. 104 ఏళ్ళ తర్వాత ఈ యోగం సెప్టెంబర్ 27వ తేదీన ఏర్పడుతుంది. దీనివల్ల లబ్ది పొందే రాశులను గురించి తెలుసుకుందాం.

మేషరాశి
హంసయోగంతో మేష రాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో చేసే అన్ని పనులలోను విజయాలు సాధిస్తారు. కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది.
తులారాశి
తులారాశి వారికి హంస యోగం కారణంగా లబ్ధి చేకూరుతుంది. తులా రాశి జాతకులు ఊహించని విధంగా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పూర్వీకుల ఆస్తులు వస్తాయి. కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. విందులు వినోదాలలో పాల్గొంటారు. ఈ రాశుల వారికి సోదరుల మధ్య ఏర్పడిన వివాదాలు సమస్య పోతాయి.
ధనస్సు రాశి
హంస యోగం కారణంగా ధనస్సు రాశి వారికి ముఖ్యంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెళ్ళికాని వారికి వివాహ సంబంధాలు ఫలిస్తాయి. కోరుకున్నచోట ఉద్యోగం లభిస్తుంది. విదేశీయానం చేసే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో అన్ని విధాలా ప్రయోజనం చేకూరుతుంది.
మీనరాశి
హంస యోగం కారణంగా మీనరాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. వీరికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఈ సమయం నిజంగా అదృష్ట సమయం. ఏ పని చేసినా అదృష్టం వెన్నంటే ఉంటుంది. కుటుంబాలతో కలిసి దూర ప్రాంతాలకు దైవ దర్శనాలు చేసుకోవడానికి వెళ్లే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications