500ఏళ్ళ తర్వాత దీపావళికి వీరికి సిరిసంపదలను వరమిచ్చిన ఐదు అద్భుతయోగాలు!

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాల సంచారం గ్రహాల సంయోగం కారణంగా శుభ అశుభ యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు కొన్ని రాశుల వారికి మంచిని చేయగా కొన్ని రాశుల వారికి కష్టాలను, నష్టాలను ఇస్తాయి. అయితే కొన్ని రాజయోగాలు దాదాపు చాలా రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తాయి.ఈ సారి దీపావళి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఈ దీపావళి చాలా స్పెషల్
దాదాపు 500 సంవత్సరాల తర్వాత దీపావళి నాడు ఐదు విశేష యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ దీపావళి పండుగ నాడు శుక్ర, చంద్ర, గురు, బుధ గ్రహాల కలయికతో అరుదైన గజకేసరి యోగం ఏర్పడుతుంది. గజకేసరి యోగంతో పాటు ఆయుష్మాన్ యోగం, బుధాదిత్య యోగం, సౌభాగ్య యోగం, శశ మహా పురుష రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ ఐదు యోగాలతో దీపావళి కొన్ని రాశులకు విశేష ఫలితాలను అందిస్తుంది.

After 500 years five amazing yogas blessed these zodiac signs wealth and happiness on diwali

గజకేసరి రాజయోగం
ప్రస్తుతం చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఇక అదే వృషభ రాశిలో ప్రస్తుతం దేవగురువు బృహస్పతి సంచరిస్తున్నాడు. ఈ రెండు రాశుల సంయోగంతో అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడింది. ఈ సంవత్సరం గజకేసరి రాజయోగం అక్టోబర్ 19వ తేదీన ఏర్పడినా ఇది కొన్ని నెలలపాటు కొనసాగనుంది.ఇక గజకేసరి రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

మేషరాశి
మేష రాశి వారికి దీపావళి నాడు ఏర్పడుతున్న విశేష యోగాల కారణంగా ఈ సమయంలో అంతా మంచే జరుగుతుంది. ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. మేషరాశి జాతకులు ఈ సమయంలో అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. జీవితంలో సంతోషం, సంతృప్తి వెల్లివిరుస్తాయి. ఈ సమయం నిజంగా మేష రాశి జాతకులకు శుభ సమయం. ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.

కన్య రాశి
గజకేసరి రాజయోగంతో పాటు దీపావళి పండుగ నాడు ఏర్పడే విశేష యోగాల కారణంగా కన్యా రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరు శుభవార్తలను వింటారు. ఈ సమయంలో కన్యా రాశి జాతకులు వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలు చేసే వారికి, వ్యాపారస్తులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఆర్థికంగా ఇది కన్యారాశి జాతకులకు శుభ సమయంగా చెప్పవచ్చు.

తులారాశి
తులా రాశి వారికి గజకేసరి రాజయోగంతో పాటు దీపావళి నాడు ఏర్పడే విశేష యోగాల కారణంగా మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఈ సమయంలో చేసే పనిలో విజయాన్ని సాధిస్తారు. తులా రాశి జాతకులు మానసికంగా ప్రశాంతతను పొందుతారు.ఫ్యామిలీకి సమయాన్ని వెచ్చిస్తారు. ఇది తులా రాశి వారికి నిజంగా అదృష్ట సమయంగా చెప్పవచ్చు. .ఈ సమయంలో విద్యార్థులకు పరీక్షలలో విజయాలు సాధ్యమవుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+