Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు ముందు దరిద్రాన్ని తెచ్చే ఈ వస్తువులను బయటపడెయ్యండి
భారతదేశంలో విశిష్టంగా జరుపుకునే పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని పరిణయమాడిన రోజుగా అక్షయ తృతీయను చెబుతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని శుక్లపక్షం తదియనాడు అక్షయ తృతీయను ఘనంగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం మే 10వ తేదీన అక్షయ తృతీయను జరుపుకోనున్నాము.
అక్షయ తృతీయకు ఇల్లు ఎలా ఉండాలి
అక్షయ తృతీయ పండుగ జరుపుకోవాలని భావించే వారు ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అక్షయ తృతీయకు ముందే మీ ఇంట్లో దరిద్రాన్ని తీసుకువచ్చే కొన్ని వస్తువులు ఉంటే వాటిని పారేయాలి. ఆ వస్తువులు ఏమిటి? అక్షయ తృతీయకు ఇంటిని ఏ విధంగా చూసుకోవాలి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఇంట్లో ఇవి ఉంటే పారెయ్యండి
ఇల్లు శుభ్రంగా లేకపోయినా, లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించే కొన్ని వస్తువులు ఇంట్లో ఉన్న ఆ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండదు. కాబట్టి అక్షయ తృతీయకు ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో పొరపాటున కూడా విరిగిపోయిన, పాడైపోయిన చీపురును ఉంచుకోకూడదు. ఇక వీటిని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది.
ఇంట్లో ఇవి ఉంటే అశుభం
అంతే కాదు చాలామంది తెగిపోయిన, పాడైపోయిన చెప్పులను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. వీటిని కూడా ఇంట్లో పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు. అక్షయ తృతీయకు ముందే వీటన్నింటిని తీసి బయట పడేయండి. ఇంట్లో విరిగిపోయిన ఫోటో ఫ్రేములు, పగిలిపోయిన అద్దాలు, పగిలిపోయిన పాత్రలు, పాడైపోయిన గిన్నెలు ఇలాంటివి ఉంచుకుంటే ఇంటికి అశుభం.
అక్కడ లక్ష్మీదేవి నివసించదు
ఇలాంటివి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. ఇలా ఇంట్లో పాడైపోయిన వస్తువులను లేకుండా చూసుకోవాలి. ఒకవేళ అవి ఇంట్లో ఉంటే ప్రతికూల ప్రభావాలు వస్తాయి. లక్ష్మీదేవి కటాక్షం లభించదు. అటువంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి పొరపాటున కూడా నివసించదు. చాలామంది ఇళ్ళు చాలా అశుభ్రంగా ఉంటాయి. ఎక్కడ చూసినా బూజు దుమ్ము ధూళితో కనిపిస్తాయి. అక్కడ లక్ష్మీదేవి పొరపాటున కూడా నివసించదు.
ఇలా ఇల్లు ఉంటే నో లక్ష్మీ కటాక్షం
అక్షయ తృతీయకు ముందు ఇంటిని ప్రతి ఒక్కరు కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రంగా సర్ది పెట్టుకోవాలి. పాడైపోయిన వస్తువులను పారేయాలి. ఎండిన మొక్కలను తీసేయాలి. ఇల్లంతా సానుకూలత కనిపించేలా ఉండాలి. అప్పుడు అక్షయ తృతీయకు లక్ష్మీదేవికి పూజలు చేసిన ఫలితం ఉంటుంది. ఇల్లంతా చెత్త కుండీలా పెట్టుకొని లక్ష్మీదేవిని ఎంత పూజించిన ఫలితం లభించదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని అక్షయ తృతీయకు ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications