Akshaya Tritiya 2025: అక్షయ తృతీయకు ఇంట్లో ఈ వస్తువులు కొంటే అశుభం!

వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో తృతీయ తిధినాడు అక్షయ తృతీయ పండుగ వస్తుంది. అక్షయ తృతీయ 2025 సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీన బుధవారం నాడు రాబోతుంది. హిందువులంతా ఎంతో పవిత్రంగా జరుపుకునే అక్షయ తృతీయ పండుగ నాడు షాపింగ్ చేస్తే, ముఖ్యంగా బంగారాన్ని కొనుగోలు చేస్తే ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుందని చాలామంది బాగా నమ్ముతారు. ఇంట్లోకి ఏవైనా వస్తువులు కొనుగోలు చేసిన మంచిదని భావిస్తారు.

అక్షయ తృతీయ నాడు కొన్ని వస్తువులు కొంటే అశుభం
అక్షయ తృతీయ నాడు పొరపాటున కూడా కొనకూడదని చెప్పే కొన్ని వస్తువులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ పండుగ నాడు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం అశుభకరంగా మారుతుందని చెబుతున్నారు. మరి అక్షయ తృతీయ నాడు కొనకూడని ఆ వస్తువులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Akshaya Tritiya 2025 It is inauspicious to buy these items at home on akshaya tritiya

ఈ వస్తువులు కొనొద్దు
అక్షయ తృతీయ పండుగ రోజు పొరపాటున కూడా కత్తి, కత్తెర, సూది, కొడవలి, గొడ్డలి, బ్లేడు వంటి పదునైన వస్తువులను కొనకూడదు. ఒకవేళ ఈ వస్తువులను కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో గొడవలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అక్షయ తృతీయ పండుగ నాడు నలుపు రంగు దుస్తులను, నలుపు రంగు వస్తువులను, నల్లటి ఫర్నిచర్ ను, నల్లని ఎలక్ట్రానిక్ వస్తువులను కొనకూడదు.

ఈ వస్తువులు, ఇలాంటి మొక్కలు కొనొద్దు
ఈరోజు నలుపు రంగు వస్తువులు కొంటే జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయి. పండుగనాడు పొరపాటున కూడా స్టీల్ సామాన్లను, అల్యూమినియం పాత్రలను కొనకూడదు అంతేకాదు పదునైన ముళ్ళు ఉన్న మొక్కలను ఇంటికి తీసుకు రాకూడదు. ఈ ముళ్ళ మొక్కలు కూడా ఇంటికి శుభంగా పరిగణించబడవు. కనుక అక్షయ తృతీయ పండుగ నాడు వీటిని కొనకుండా ఉంటేనే మంచిది.

ఆ వస్తువులతో కోరి కష్టాలను తెచ్చుకోకండి
అక్షయ తృతీయ పండుగ నాడు వీలైతే బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసుకోవడం శుభప్రదం. వాటిని ఒకవేళ కొనలేకపోయినా పర్వాలేదు కానీ పైన పేర్కొన్న వస్తువులు మాత్రం పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకండి. కోరి కష్టాలను తెచ్చుకోకండి. ఆ వస్తువులు మీకు అనవసరమైన సమస్యలకు కారణమవుతాయి కనుక జాగ్రత్త!

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+