అంగారక యోగం ముగిసింది.. గండం గడిచింది.. ఈ రాశులవారికి అదృష్టం తలుపు తెరిచింది!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని యోగాలు శుభయోగాలు కాగా మరికొన్ని అశుభయోగాలు. నవగ్రహాలలో నీడ గ్రహమైన రాహువుతో కుజుడు కలవడం వల్ల అంగారక యోగం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ అంగారక యోగం ప్రభావంతో జూన్ ఒకటవ తేదీ వరకు కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యాయి.

అంగారక యోగం ముగియటంతో తెరుచుకున్న అదృష్టం తలుపులు
ఇప్పుడు అంగారక యోగం ముగిసిపోవడంతో కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తెరుచుకుంది. మీనరాశి నుండి కుజుడు వెళ్లిపోవడంతో అంగారక యోగం అంతరించింది. ప్రస్తుతం కుజుడు జులై 12వ తేదీ వరకు మేషరాశిలో ఉండి ఆ తర్వాత వృషభ రాశిలో సంచరిస్తాడు. మీనరాశి నుండి కుజుడు నిష్క్రమించడంతో కొన్ని రాశుల వారికి రెట్టించిన అదృష్టం వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Angaraka Yoga is over Luck has opened the door for these zodiac signs

మేషరాశి
ప్రస్తుతం మేషరాశిలో అంగారకుడు సంచరిస్తున్నాడు. ఈ సమయం మేషరాశి జాతకులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. జీవితంలో వచ్చిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. వ్రుత్తి, వ్యాపారాలలోనూ ఆశించిన ఫలితాలు వస్తాయి. ఈ సమయం మీకు చాలా ప్రొడక్టివ్ గా ఉంటుంది. ఏ పని అనుకున్న ఇట్టే నెరవేరుతుంది.

సింహరాశి
అంగారక యోగం ముగియడంతో సింహరాశి జాతకులకు అదృష్టం ప్రకాశిస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఏ పని చేపట్టినా విజయం మీ సొంతమవుతుంది. ఆర్థికంగా లబ్ధి జరుగుతుంది. కుటుంబ పరిస్థితి సంతోషదాయకంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం.

కర్కాటక రాశి
అంగారక యోగం ముగిసిన కారణంగా కర్కాటక రాశి జాతకులకు మంచి సమయం ప్రారంభమైంది. ఈ సమయంలో వీరు ఏం చేసినా తిరుగే ఉండదు. ఆర్థిక లాభాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగాను అన్ని విషయాలలోనూ విజయం సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలు గడిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డబ్బు, ఆస్తికి సంబంధించి మీరు వేసుకున్న ప్రణాళికలు ఈ సమయంలో నెరవేరుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+