astrology: జాతకంలో చంద్రదోషం.. ఈ భయంకర రోగాలకు ఛాన్స్; దోష నివారణకు పరిహారాలివే!!

మన జీవితంపై నవగ్రహాల ప్రభావం ఉంటుంది. గ్రహ సంచారాన్ని బట్టి మన జీవితం నిర్ధారించబడి ఉంటుంది. కొన్నిసార్లు గ్రహాలు బలంగా ఉంటే సానుకూల ఫలితాలు, బలహీనంగా ఉంటే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. మన జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే మిగతా గ్రహాల అనుకూలత లేకపోయినా రాణించే అవకాశాలు ఉంటాయి. జాతకంలో చంద్రుడు బాగాలేకపోతే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.

చంద్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే తీవ్రమైన అనారోగ్యాలు కలుగుతాయి. ఏదో తెలియని భయం, భవిష్యత్తు గురించి ఆందోళన, లేని విషయాలను ఉన్నట్టుగా ఊహించుకోవడం, ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి మాత్రమే కాదు మనసు నిలకడగా లేకపోవడం, చెప్పిన మాటకు చేసే పనికి పొంతన లేకపోవడం, బంధువులకు దూరమవడం, ప్రతి చిన్న విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వంటి సమస్యలు కలుగుతాయి.

Astrology

జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే చంద్ర దోషాలు ఉంటే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చంద్రుడిని మనసుకు కారణమైన గ్రహంగా చెబుతారు. అందువల్ల చంద్రుడు బలహీనంగా ఉంటే మానసిక ఒత్తిడి కలుగుతుంది. మధుమేహం, కిడ్నీ సంబంధిత వ్యాధులు, కఫ సంబంధిత వ్యాధులు, మూత్ర సంబంధిత వ్యాధులు, నోరు, దంతాలకు సంబంధించిన సమస్యలు, పచ్చ కామెర్లు, డిప్రెషన్, గుండెకు సంబంధించిన వ్యాధులు చంద్రుడు బలహీనంగా ఉంటే వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి చంద్ర దోష నివారణ కావడానికి, చంద్రుడు బలం పుంజుకోవడానికి కొన్ని పరిహారాలు చేస్తే ఫలితముంటుందని చెబుతున్నారు. గోమూత్రం, గోవు పాలు, గోవు పెరుగు, గోవు పేడ, నెయ్యి తో పాటు మంచి గంధాన్ని, స్పటికాన్ని కలిపి ఆ నీళ్లల్లో శంఖం వేసి, నీటిని వేడి చేసి, ఆ నీటితో స్నానం చేస్తే చంద్ర దోషం పోతుందని చెబుతారు .

అంతే కాదు సోమవారం నాడు చిటికెన వేలుకి వెండి ఉంగరం లో తెల్లటి ముత్యాన్ని ధరించాలి అని చెబుతారు. సోమవారం నాడు శివునికి పాలు, పెరుగు, నెయ్యి సమర్పిస్తే చంద్ర దోషం పోతుందని చెబుతారు. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని ప్రతీ రోజూ 108 సార్లు జపిస్తే చంద్ర దోషం పోతుంది. హనుమంతుని పూజించినా, అమావాస్య రోజున ఆలయానికి వెండి ని దానం చేసిన చంద్ర దోషం పోతుందని చెప్తున్నారు.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర అభిప్రాయాలు,సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+