Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Astrology: అక్టోబర్ లోనే దుష్ట పిశాచయోగం: 3రాశులవారికి కష్టాలు, తీవ్ర నష్టాలు!!

అక్టోబర్ మాసంలో ఏ విధంగా అయితే శుభ యోగాలు ఉన్నాయో, అదేవిధంగా అశుభ యోగాలు కూడా ఉన్నాయి. అక్టోబర్ నెలలో శని రాహువుల సంయోగం వల్ల విధ్వంసక పిశాచ యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం శని రాహువు కు చెందిన శతభిషా నక్షత్రం ద్వారా సంచారం చేస్తున్న కుంభ రాశిలో ఉన్నాడు. అక్టోబర్ 17వ తేదీ వరకు రాహు నక్షత్రంలో ఉంటాడు.

శని గ్రహం శతభిష నక్షత్రంలో ఉండటం వల్ల ప్రతికూల ఫలితాలను కలిగించే దుష్ట పిశాచ యోగం ఏర్పడుతుంది. పిశాచ యోగం వ్యక్తి జీవితం పై దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ప్రతికూలతలకు కారణమవుతుంది. అంతర్గత గందరగోళాలు, బాహ్య సవాళ్లకు దారితీస్తుంది. అక్టోబర్ 17వ తేదీ వరకు పిశాచ యోగం వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు.

Astrology: Pisach Yoga: Difficulties and severe losses for 3 zodiac signs!!

కర్కాటక రాశిలో జన్మించిన వారికి శని, రాహువుల కలయిక వల్ల ఏర్పడే పిశాచ యోగం తీవ్రమైన బాధలను తెస్తుంది. మీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. శారీరక, మానసిక క్షోభను అనుభవిస్తారు. వృత్తి వ్యాపారాలలో ను తీవ్ర సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటారు. పనిలో పై అధికారులతో విభేదాలు తలెత్తి నష్టాలకు దారితీస్తుంది .

అక్టోబర్ 17వ తేదీ వరకు ఉన్న కాలం ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అంతే కాదు కర్కాటక రాశి వారు పనులలో అడ్డంకులు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

కన్య రాశి వారికి ఈ సమయం ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది . పిశాచ యోగం వల్ల కన్యా రాశి వారు అక్టోబర్ 17వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా నష్టాలకు దారితీయవచ్చు. ఏ ప్రయత్నం లోనైనా విజయం అంతంతమాత్రంగానే ఉంటుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకులు పిశాచ యోగం వల్ల అనేక కష్టాలను ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలోనూ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది.

పిశాచ యోగం మీన రాశి వారికి కష్టాలను తెచ్చిపెడుతుంది. అక్టోబర్ 17వ తేదీ వరకు వీరికి అన్ని అంశాలలో నష్టాలు, కష్టాలే కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఈ పిశాచ యోగం మానసిక క్షోభకు దారితీస్తుంది. ప్రతికూల ఆలోచనలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించిన విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+