Astrology: రాహు-కేతు-శని సంయోగం; ఈ రాశులవారికి సవాళ్ళ కాలం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క చలనం వివిధ రాశుల వారి జీవితాలపై అనూహ్యమైన మార్పులకు కారణమవుతుంది. ప్రస్తుతం రాహు కేతు శని సంయోగం వివిధ రాశుల వారికి ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా ఐదు రాశుల వారు రాహువు కేతువు మరియు శని యొక్క ప్రభావం చేత అనేక సవాళ్లను, కష్టాలను ఎదుర్కోనున్నారు. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాము.
రాహు కేతువులను నీడ గ్రహాలు అంటారు. సహజంగా ఈ రెండు గ్రహాలను అశుభాలను సూచించే గ్రహాలు గానే చూస్తారు. వీటితోపాటు శని కూడా చేరితే ఈ మూడింటి సంయోగం వల్ల చాలా తీవ్రమైన పరిణామాలను కొన్ని రాశుల వారు ఎదుర్కొంటారు. ముఖ్యంగా మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

మేష రాశి : రాహు కేతు శని సంయోగం వల్ల మేషరాశి వారికి ఈ సమయంలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది. డబ్బు నీళ్లలా ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో కలిగే ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబ సంబంధాలపై ఒత్తిడి కలుగుతుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి రాహువు కేతువు శని సంయోగం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అనవసరమైన ఖర్చులు మీ పొదుపును తగ్గిస్తాయి. అప్పులు పేరుకుపోవటంతో జాగ్రత్తగా ఉండండి. ఈ దశలో ఎవరికీ డబ్బు ఇవ్వకుండా ఉండండి. అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో బాధించవచ్చు. వైవాహిక జీవితంలో చిరాకులు కలగవచ్చు . ఆర్థిక వ్యవహారాలపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
సింహరాశి : సింహ రాశి వారికి రాహు కేతు శని సంయోగం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. సింహరాశి వారు ఈ సమయంలో ఏ పని చేసిన ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. భాగస్వాములు వ్యాపారాన్ని ప్రభావితం చేసి ఆర్థిక ఇబ్బందులను కలిగించవచ్చు. అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి రాహు కేతు శని సంయోగ ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి వారికి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులను తీసుకోకుండా ఉంటేనే మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక విషయాలు సవాల్ గా మారుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి.
మీనరాశి : మీన రాశి వారికి రాహు కేతు శని సంయోగం సవాళ్లతో కూడిన కాలాన్ని ఇస్తుంది. మీన రాశి వారి కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడే పరిస్థితి వస్తుంది. ప్రణాళిక లేని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఇబ్బందులకు కారణమవుతాయి. అనవసరపు వివాదాలలో చిక్కుకునే ప్రమాదం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications