Astrology: నవగ్రహాల దోషనివారణకు ఈ మొక్కలు నాటి పూజించాలి!!

మానవ జీవితంపై గ్రహాలు ఎంతో ప్రభావాన్ని కలుగజేస్తాయి. గ్రహాల గమనం వల్ల వివిధ రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులు వస్తాయి అన్న విషయం మనకు తెలిసిందే. అయితే గ్రహాలు ఆయా రాశులలో నీచ స్థానాలలో ఉంటే వారు ప్రతికూల ఫలితాలను పొందవలసి వస్తుంది. గ్రహాలు రాశులలో మంచి స్థానంలో ఉంటేనే అనుకూల ఫలితాలు వస్తాయి.

గ్రహాలు నీచ స్థానంలో ఉంటే ఆ సమయంలో గ్రహ శాంతి కోసం కొన్ని పరిహారాలను చేయవలసి ఉంటుంది. అయితే నవగ్రహాలకు శాంతి కలగజేయడానికి ఏ మొక్కలను నాటాలి? వేటిని పూజించాలి? వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కేతు గ్రహానికి సంబంధించి దర్భ మొక్కలను నాటడం, పూజించడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Astrology: These plants should be worshiped for the prevention of Navagraha dosha!!

రాహు గ్రహానికి సంబంధించి గరిక మొక్కలను నాటడం మంచిదని, గరికనే పూజించాలని సూచిస్తున్నారు . అందుకే గ్రహణాల సమయంలో గరికనే ఉపయోగిస్తాము. శని గ్రహానికి సంబంధించి జమ్మి మొక్కలను నాటడం పూజించడం మంచిది. శుక్ర గ్రహానికి సంబంధించి మేడి మొక్కలను నాటడం పూజించడం మంచిది. గురు గ్రహానికి సంబంధించి రావి మొక్కలను నాటడం పూజించడం మంచిది.

బుధ గ్రహానికి సంబంధించి ఉత్తరేణి మొక్కలను నాటి పూజించడం వల్ల బుధుడి వల్ల కలిగే అశుభ ఫలితాలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. కుజ గ్రహానికి సంబంధించి సండ్ర మొక్కలను నాటి పూజించడం మంచిది . చంద్రగ్రహానికి సంబంధించి మోదుగ మొక్కలను నాటి పూజించడం వల్ల చంద్రుడు శాంతిస్తాడని చెబుతున్నారు.

రవి గ్రహానికి సంబంధించి తెల్ల జిల్లేడు మొక్కలను నాటి పూజించడం వల్ల రవి మనపై ఉంటుందని చెబుతున్నారు . కనుక నవగ్రహాల శాంతి కోసం పైన సూచించిన మొక్కలను నాటి పూజిస్తే మెరుగైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి గ్రహాల స్థానం మీ జీవితంలో ఇబ్బంది పెడుతుంటే కచ్చితంగా ఈ మొక్కలను నాటి పూజించాలని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+