astrology: మరణం ముందు కనిపించే సంకేతాలివే!!
మరణానికి ముందు కచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయని జ్య్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు.
చాలామంది మరణం ముందు రకరకాల సంకేతాలను చూస్తూ ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరణం అకస్మాత్తుగా రాదని, అది మనకు కొన్ని సంకేతాలు చూపించే వస్తుందని అంటున్నారు. మరణం వచ్చేముందు మనం గమనించక పోయినా సరే కచ్చితంగా కొన్ని సంకేతాలను చెప్పి మరీ వస్తుందని చెబుతున్నారు. మనిషి జీవితంలో తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో కచ్చితంగా వచ్చేది మరణం. ఇక ఆమరణం వచ్చే ముందు కనిపించే సంకేతాలను చూసినట్లయితే..

మరణం వచ్చే ముందు కనిపించే సంకేతాలు ఇవే
మరణం వచ్చే ముందు మన ముఖం అద్దంలో కనిపించదట. నీళ్లలో చూసినా, నూనెలో చూసినా కూడా మన ముఖం కనిపించదని చెబుతున్నారు. మరణం వచ్చే ముందు ఎన్ని రంగులు ఉన్నా అన్ని నల్ల రంగులోనే కనిపిస్తాయని, నడిచేటప్పుడు నీడ కూడా నేల మీద పడదని చెబుతున్నారు. మరణం వచ్చే ముందు నాలుక పెద్ద సైజులో బయటకు వస్తుందని, చనిపోయే వారికి కచ్చితంగా అది అర్థమవుతుందని చెబుతున్నారు. అంతేకాదు మరణ సంకేతంగా ఎడమ చేయి దానికదే అదురుతుందని చెబుతున్నారు.

మరణానికి ముందు కలలో ఇవి తప్పనిసరిగా వస్తాయి
మరణం వచ్చే ముందు సూర్యుడు, చంద్రుడు, ఆకాశం మొత్తం ఎర్ర రంగులో కనిపిస్తాయని, బ్లూ రంగులో ఉండే ఈగలు తల చుట్టూ ఐదారు సార్లు తిరుగుతాయని చెబుతున్నారు. మరణం వచ్చే ముందు మనకు కలలో గుడ్లగూబ గాని, ఖాళీ చేసిన ఊరు కానీ కనిపిస్తాయని చెబుతున్నారు. ఇక మరణం వచ్చేముందు రోజు పుష్పక విమానం కలలో కనిపిస్తుందని అంటున్నారు.

మరణానికి ముందు రోజు ఇవి జరిగే అవకాశం
పావురం, కాకి, గద్ద, ఏ ఒక్కటైనా మన తల మీద వాలిన, తలని తన్నుకుంటూ వెళ్లిన మరణ సంకేతంగా చెబుతున్నారు. చనిపోయే ముందు రోజు శివపార్వతులు దంపతుల రూపంలో పరామర్శించడానికి వస్తారని చెబుతున్నారు. మరణం వచ్చేముందు రెండు పిచ్చుకలు నీళ్లలో స్నానం చేస్తూ కనిపిస్తాయని, తీతువు పిట్ట ఇంటిపై నుండి వెళుతుందని చెబుతున్నారు. ఇక మరణానికి ముందు రోజు రాత్రి యమభటులు పేరు అడిగి కన్ఫామ్ చేసుకుంటారని చెబుతున్నారు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం మరణం ముందు ఈ సంకేతాలన్నీ వస్తాయని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications