భాద్రపద పూర్ణిమ 2023: అరుదైన 4 శుభ యోగాలతో లక్ష్మీ కటాక్షం!!

హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద పూర్ణిమ చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజు హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజు విష్ణు మూర్తికి ఇష్టమైన రోజు. ఈ రోజు సత్యన్నారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మంచిది. ఈరోజు లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలా మంది విష్ణువుకు భక్తితో పూజలు చేస్తారు.

ఈ సంవత్సరం భాద్రపద పూర్ణిమ సెప్టెంబర్ 28వ తేదీన సాయంత్రం 6 గంటల 49 నిముషాలకు మొదలై సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 3:29 నిముషాలకు ముగుస్తుంది. ఈరోజు విష్ణు మూర్తిని ఎవరైతే అత్యంత భక్తితో పూజిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. భాద్రపద పూర్ణిమ విషయానికి వస్తే ఇది పితృ పక్ష ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజు చంద్రుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

Bhadrapada Purnima 2023: Lakshmi blessings with rare 4 auspicious yogas!!

ఈ సంవత్సరం భాద్రపద పూర్ణిమ చాలా అరుదైన యోగాలతో ఏర్పడుతుంది. భాద్రపద పూర్ణిమ నాలుగు పవిత్రమైన యోగాల ఏర్పాటుతో ఈ సంవత్సరం లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తుంది. భాద్రపద పూర్ణిమ 2023 నాడు నాలుగు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. వాటిలో సర్వార్థ సిద్ధి యోగం, వృద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, ధృవ యోగం ముఖ్యమైనవి. ఈ సమయంలో లక్ష్మీ పూజ చేయడం వల్ల ఆరాధకులకు ఆర్థిక లాభాలు, విజయము చేకూరుతాయి.

ఇక సర్వార్ధ సిద్ది యోగం, అమృత సిద్ధి యోగం సెప్టెంబర్ 29వ తేదీ రాత్రి 11:18 నిమిషాల నుండి సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 6: 13 నిమిషాల వరకు ఉంటుంది. వృద్ధి యోగం సెప్టెంబరు 28 తేదీ రాత్రి 11:55 నుండి సెప్టెంబర్ 29 రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది.

ఇక ధృవ యోగం సెప్టెంబర్ 29వ తేదీన రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల నుండి సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రం 4: 27 నిమిషాల వరకు ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఈ భాద్రపద పూర్ణిమ శుక్రవారం రోజున వచ్చిన నేపథ్యంలో శుక్రవారాలు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజులు కాబట్టి ఈరోజు విష్ణువును, లక్ష్మీని భక్తితో పూజించిన వారికి మంచి ఫలితాలు కలుగుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+