కుజసంచారంతో హనుమాన్ జయంతి నుండి ఈ రాశులవారికి సిరిసంపదలు
జ్యోతిష్య శాస్త్రంలో హనుమాన్ జయంతికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈసారి హనుమాన్ జయంతి రోజు మంగళవారం కలిసి రావడంతో ఈ ప్రాధాన్యత మరింత పెరిగింది. హనుమాన్ జయంతి నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం, చైత్ర పౌర్ణమి వంటి శుభకరమైన ఘట్టాలు ఏర్పడడంతో కొన్ని రాశులవారికి అది మేలు చేస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశులవారు హనుమాన్ జయంతి నుండి సిరిసంపదలతో తులతూగుతారు. మరి ఆ రాశులేమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
వృషభ రాశి
హనుమాన్ జయంతి నుండి కుజ గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా వృషభ రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక వృద్ధిని సాధిస్తారు. వీరి కష్టాలు తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి .వ్యాపార పరంగా అమితమైన లాభాలను పొందుతారు. శత్రువులను ఈ సమయంలో ధీటుగా ఎదుర్కొంటారు. చేసిన శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ధనుస్సు రాశి
హనుమాన్ జయంతి నుంచి ధనుస్సు రాశి వారికి డబ్బుకు లోటు లేకుండా పోతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తారు. ఎంతోకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగంలో మీ అంకితభావం వల్ల ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు.
తులా రాశి
కుజ సంచారం కారణంగా హనుమాన్ జయంతి నుండి తులా రాశి జాతకులు అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుతారు. వీరి జీవితంలో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు శుభవార్తలు వింటారు. విదేశీ వనరుల నుంచి ఊహించని లాభాలు పొందుతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. పనిలో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. జీవితంలోని ప్రతి రంగంలోనూ మీరు విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది.
కుంభరాశి
హనుమాన్ జయంతి నాడు కుజ సంచారం కారణంగా కుంభ రాశి జాతకులకు ధనలాభం కలుగుతుంది. ఈ సమయంలో మీరు వృత్తి వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. ఈ సమయంలో ప్రమోషన్లు అందుకుంటారు. ఆర్థిక ప్రగతి మిమ్మలను సంతోషానికి గురి చేస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications