ఫిబ్రవరి 13 నుండి ఈ రాశులవారు ఏనుగు కుంభస్థలం బద్దలు కొడతారు!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల స్థాన మార్పులు ద్వాదశ రాశులవారికి శుభ, అశుభ యోగాలను కలిగిస్తాయి. గ్రహాల రాజు సూర్యుడు నెల రోజులకు ఒకసారి, గ్రహాల రాకుమారుడు బుధుడు 21 రోజులకు ఒకసారి రాశిని మారుస్తూ సంచారం చేస్తారు. ఈ ఫిబ్రవరి నెలలో సూర్యుడు, బుధుడు కుంభరాశిలో కలవడం ద్వారా 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడనుంది.
కుంభరాశిలో బుధాదిత్య రాజయోగం
ఫిబ్రవరి 13న సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ క్రమంలోనే బుధుడు కూడా కుంభరాశిలో ఉండటంతో సూర్య-బుధ సంయోగం ఏర్పడి, బుధాదిత్య రాజయోగంగా మారుతుంది. ఈ కలయిక కొన్ని రాశుల వారికి అన్ని విధాలా శుభాలను చేకూరుస్తుంది. వ్యాపారం, కెరీర్‌లో పురోగతి, ఆకస్మిక ధనలాభాలను చేకూర్చనుంది. బుధాదిత్య రాజయోగం కారణంగా అదృష్టం కలిసొచ్చే రాశుల గురించి తెలుసుకుందాం.

మేష రాశి
మేషరాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం గొప్ప ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ యోగం మీ రాశి నుండి 11వ స్థానంలో ఏర్పడటం వలన మేషరాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొత్త మార్గాల ద్వారా కూడా మేషరాశి జాతకులు ధనాన్ని ఆర్జిస్తారు. పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం కనిపిస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి బుధాదిత్య రాజయోగం అద్భుత శుభ ఫలితాలను తెస్తుంది. ఈ రాశిలో అదృష్ట స్థానంలో ఈ యోగం ఏర్పడటం కలిసి వస్తుంది. దేశ, విదేశీ ప్రయాణాలకు అవకాశాలుంటాయి. మిథున రాశి వారు మతపరమైన కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతికి సంబంధించిన శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి
కుంభరాశిలో బుధాదిత్య రాజయోగం కర్కాటక రాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. శుభవార్తలు వింటారు. కోరికలు నెరవేరతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది . కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా కర్కాటక రాశి వారికి లాభాలుంటాయి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది.
మకర రాశి
మకర రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా కలిసి వస్తుంది. ఇది వీరికి వ్యాపారంలో లాభాలు తెస్తుంది. ధన స్థానంలో ఈ యోగం ఏర్పడటంతో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి సంబంధిత నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం అనుకూలం, అయితే మకరరాశి వారికి జాగ్రత్త అవసరం. రావాల్సిన బకాయిలు కూడా తిరిగి వసూలవుతాయి.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications