చైత్ర నవరాత్రులలో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది!!
ఉగాది పర్వదినం నుండే చైత్రమాసం ప్రారంభమైంది. నేటి నుండి తొమ్మిది రోజులపాటు చైత్ర నవరాత్రులు జరగనున్నాయి. వీటినే వసంత నవరాత్రులు అని కూడా అంటారు. ఈ తొమ్మిది రోజులలో దుర్గామాత యొక్క తొమ్మిది రూపాలను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే దుర్గామాత కటాక్షం ఉంటుందని, కోర్కెలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
చైత్ర నవరాత్రులలో అమ్మవారికి ఇష్టమైన రంగులు
అయితే ఈ తొమ్మిది రోజులు దుర్గామాతను ప్రసన్నం చేసుకోవడానికి ఏ రోజు ఏ దుస్తులను ధరించాలి? అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు? అమ్మవారికి ఇష్టమైన రంగులు ఏమిటి? వంటి వివరాలను తెలుసుకుందాం. చైత్ర నవరాత్రులలో భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తే అది అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది.

శైలపుత్రి, బ్రహ్మచారిణి మాతలకు ఇష్టమైన రంగులివే
చైత్ర నవరాత్రుల తొలి రోజున అమ్మవారు శైలపుత్రి గా దర్శనమిస్తారు. ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి గా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు తెల్లని వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజిస్తే మంచిది.
ఈ రంగుల దుస్తులతోనే పూజిస్తే శుభం
మూడవరోజు చంద్ర ఘంట అమ్మవారిగా తల్లి దర్శనమిస్తుంది. ఈరోజు గోధుమరంగు వస్త్రాలను ధరించి దుర్గాదేవిని పూజిస్తే మంచిది. నాలుగవ రోజు అమ్మవారు కూష్మాండ గా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈరోజు నారింజరంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఐదవ రోజు స్కందమాత ను భక్తులు పూజిస్తారు. ఈరోజు బూడిద రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఆరవరోజున అమ్మవారు కాత్యాయనిగా దర్శనమిస్తారు. ఆరోజు ఎరుపు లేదా పసుపు బట్టలను ధరిస్తే మంచిది.
తల్లి అవతారాన్ని బట్టి ఆ రంగు దుస్తులు
ఏడవ రోజు అమ్మవారు మహా కాళరాత్రిగా దర్శనమిస్తారు. ఆరోజు అమ్మవారిని నీలం రంగు దుస్తులతో పూజిస్తే మంచిది. నవరాత్రులలో ఎనిమిదవ రోజున మహాగౌరిగా దర్శనం ఇస్తారు. దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తే మంచిది. ఇక నవరాత్రులలో చివరి రోజైన తొమ్మిదవ రోజు అమ్మవారు సిద్ధి ధాత్రి గా దర్శనమిస్తారు. ఈరోజు ఊదా రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తే మంచిది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications