చంద్ర మంగళ యోగంతో నేటినుండి వీరి అదృష్టానికి అవధుల్లేవు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి సముచిత స్థానం ఉంటుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి నిర్దిష్ట కాలమానం ప్రకారం తిరుగుతూ ఉంటాయి. వివిధ రాశుల్లోకి గ్రహ సంచారాలు, వివిధ గ్రహాలతో గ్రహ సంయోగాల కారణంగా కొన్ని యోగాలు ఏర్పడతాయి. అవి కొన్ని శుభ యోగాలు కాగా మరికొన్ని అశుభ యోగాలు.
చంద్ర మంగళ యోగం
ఆగస్టు 25వ తేదీన అంటే నేడు ఉదయం 8.08 నిమిషాలకు చంద్రుడు కన్యా రాశిలో కి వెళ్ళాడు. ఇప్పటికే కుజుడు అదే రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ రెండింటి సంయోగం ఆగస్టు 27వ తేదీ రాత్రి 7.21 నిమిషాల వరకు ఉంటుంది. చంద్ర కుజుల సంయోగం కారణంగా చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. ఈ చంద్రమంగళ యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.

మేషరాశి
మేష రాశి వారికి చంద్రమంగళ యోగం కారణంగా శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మేషరాశి వారు జీవితంలో విజయాలను అందుకుంటారు. నూతన అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో సానుకూల శక్తి వల్ల ఏ పని చేసిన అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి చంద్రమంగళ యోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు నూతన అవకాశాలను పొందే అవకాశం ఉంది. పనిచేసే చోట సానుకూల ఫలితాలు వస్తాయి. ఐటీ, సైన్స్ టెక్నాలజీ రంగాలలో ఉన్న వారికి కలిసి వస్తుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. చంద్రమంగళ యోగం కారణంగా వృషభ రాశి వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది.
ధనుస్సు రాశి
చంద్రమంగళ యోగం ధనుస్సు రాశి జాతకులకు సంతోషాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు ఆర్థికంగా సానుకూల ఫలితాలను పొందుతారు. ధనస్సు రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరంగాను స్థిరత్వం వస్తుంది. అయితే ధనుస్సు రాశి వారు ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications