ఫిబ్రవరిలో చతుర్గ్రాహి యోగం.. వీరి పంట పండే సమయం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అన్ని రాశులు ప్రభావితం అవుతాయని మనకు తెలిసిందే. అయితే ఫిబ్రవరి నెలలో జరిగే గ్రహ సంచారాలు కూడా అంతే ముఖ్యమైనవి. ఫిబ్రవరి నెలలో వ్యాపార ప్రదాత అయిన బుధుడు మూడవ తేదీన కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత సంపదలకు రాజు అయిన శుక్రుడు ఫిబ్రవరి 6వ తేదీన కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు.
కుంభరాశిలో చతుర్గ్రాహి యోగం.. వీరికి అదృష్టం
గ్రహాల రాజు అయిన సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీన కుంభరాశి లోకి సంచారం చేస్తాడు. ఆపై గ్రహాల అధిపతి అయిన కుజుడు ఫిబ్రవరి 23వ తేదీన కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నాలుగు గ్రహాలు కుంభరాశి లో సంయోగం చెందడంతో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులను తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి చతుర్గ్రాహి యోగం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ యోగం వృషభ రాశి వారి ఆదాయ, లాభ గృహంలో జరుగుతుంది. దీని వల్ల మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వృషభ రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కొత్త ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి సమయం. వృషభ రాశి వారు మీ చదువులలో సానుకూల ఫలితాలను చూస్తారు. పెట్టుబడులు మీకు లాభాలను తెస్తాయి.
మిధున రాశి
చతుర్గ్రాహి యోగం మిధున రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మిధున రాశి వారి కెరీర్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ యోగం మిధున రాశిలో కర్మ గృహంలో జరగడం వల్ల మీరు పనిలోనూ, వ్యాపారం లోను పురోగతిని చూస్తారు. చాలాకాలంగా ప్రయత్నం చేస్తున్న పనిలో మిధున రాశి వారు విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగులకు వారి జూనియర్లు, సీనియర్ల నుండి మద్దతు లభిస్తుంది.
కుంభరాశి
కుంభ రాశి వారికి చతుర్గ్రాహి యోగం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుంభ రాశి జాతకుల పనితీరు మెరుగుపడుతుంది. ప్రజలు ఈ ప్రయత్నాలను అభినందిస్తారు. ఈ సమయంలో చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ గౌరవం పెరుగుతుంది. వివాహితులు అద్భుతమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు. అవివాహితులు వివాహ ప్రతిపాదనలు పొందుతారు.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications