చాతుర్మాసంలో ధనలక్ష్మీ కటాక్షం కోసం చెయ్యవలసిన పనులు!!
చాతుర్మాసంలో శ్రీమహా విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. ఈ మాసంలో ఎవరైతే మహా విష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అంతేకాదు చాతుర్మాసంలో లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉంది. చాతుర్మాసాన్ని హిందువులు పరమ పవిత్రమైన మాసంగా భావిస్తారు.
చాతుర్మాసం ప్రారంభం
హిందూ క్యాలెండర్ లో చాతుర్మాసం ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలోని దేవశయని ఏకాదశి నాడు ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం చాతుర్మాసం నేటి నుండి జులై 17నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈసారి చాతుర్మాసం నాలుగు నెలల కాలం పాటు కొనసాగనుంది. నవంబర్ 12వ తేదీన కార్తీక మాసం లోని ఉత్థాన ఏకాదశి నాడు చాతుర్మాసం ముగుస్తుంది.

చాతుర్మాసంలో చెయ్యాల్సిన పనులు
చాతుర్మాస కాలంలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలో ఉన్న సమయంలో పరమ శివుడు సృష్టి సంరక్షణా బాధ్యతను తీసుకుంటాడని చెప్తారు. ఇక తల్లి లక్ష్మీదేవి సైతం ఈ మాసంలో మహా నిష్ఠతో విష్ణువును పూజిస్తుందని చెప్తారు. అయితే చాతుర్మాసంలో కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ముఖ్యంగా చాతుర్మాసంలో దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.
నాలుగు నెలలలో ఎప్పుడు దానధర్మాలు చేసినా లక్ష్మీ కటాక్షం
దానధర్మాలకు చాతుర్మాసంలో ప్రత్యేకమైనస్థానం ఉంటుంది. ఈ రోజు నుండి నాలుగు నెలలపాటు ఎవరికి తోచినట్టు వారు దాన ధర్మాలు చేస్తే మంచిది. ఆహార ధాన్యాలు, గోవులను దానం చేయడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుందని చెప్తారు. చాతుర్మాసం లో భక్తి శ్రద్ధలతో పూజలు, దానం చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి సంతోషంగా జీవించవచ్చని చెప్తారు.
చాతుర్మాసంలో ఇలా చెయ్యండి.. ఫలితం బాగుంటుంది
చాతుర్మాసంలో ప్రతీ ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకుని, ఉదయం, సాయంత్రం రెండుపూటలా విష్ణువును పూజించడం వల్ల లక్ష్మీదేవికి సంతోషం కలుగుతుంది. ఫలితంగా లక్ష్మీ అనుగ్రహం మనకు లభిస్తుంది. అంతేకాదు చాతుర్మాసంలో తెల్లవారుజామునే నిద్ర లేచి, ఇల్లు శుభ్రం చేసుకుని, స్నానం చేసి, భగవంతుడిని పూజించి, ఉపవాస దీక్షను ఆచరించి, ఈ చాతుర్మాసం అంతా నేలపైన పడుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు.
చాతుర్మాసంలో ఇది మరచిపోవద్దు
అంతేకాదు చాతుర్మాసంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం తులసీ దేవికి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల శుభాలు జరుగుతాయని చెబుతారు. ఈ మాసంలో తులసిని పూజించడం వల్ల జీవితంలో వచ్చే కష్టాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాదు తులసిని పూజించినవారు తన కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications