నేటినుండి చాతుర్మాసం.. నవంబర్ 12 వరకు వీరిపైనే లక్ష్మీకటాక్షం!!
నేటి నుండి చాతుర్మాసం ప్రారంభమైంది. నేడు శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి జారుకునే రోజు అయిన దేవశయని ఏకాదశి. నేటి నుంచి నవంబర్ 12వ తేదీ వరకు చాతుర్మాసం కొనసాగుతుంది. మొత్తం 118 రోజులపాటు శ్రీమహావిష్ణువు కి అంకితం చేయబడిన మాసం చాతుర్మాసంగా చెప్పబడుతుంది.
నేటి నుండి వీరికి ధనలక్ష్మీ కటాక్షం
చతుర్మాసం అంటే నాలుగు నెలల కాలం.. ఈ సమయంలో కీలక గ్రహాల గమనం కారణంగా కొన్ని రాశుల వారి పైన విష్ణువు యొక్క కటాక్షం మెండుగా ఉంటుంది. జులై 17వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ముఖ్యంగా ఐదు రాశుల వారికి విష్ణువు దయతో ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది.

వృషభరాశి
వృషభ రాశి వారికి నేటి నుంచి నాలుగు నెలల కాలం అదృష్టకాలంగా చెప్పవచ్చు. ఈ సమయంలో వీరు పరిష్కారం కానీ ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన పురోగతి ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ధన లాభం కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహాల ప్రతిపాదనలు వస్తాయి.
మిధున రాశి
నేటి నుంచి నవంబర్ 12 వరకు మిధున రాశి జాతకుల అదృష్టం కలిసొస్తుంది. ఈ సమయంలో మిధున రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థికంగా మిధున రాశి వారు బలోపేతం అవుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇది సరైన సమయం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి చాతుర్మాస కాలం బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు అనుకున్న అన్ని పనులను పూర్తి చేస్తారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. ఉద్యోగ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కన్యా రాశి
చాతుర్మాస కాలంలో కన్యా రాశి వారికి అన్ని విధాలుగా కలిసివస్తుంది. మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. డబ్బు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయం కన్యా రాశి వారికి అదృష్ట సమయం.
కుంభరాశి
చాతుర్మాసకాలం కుంభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృత్తి జీవితంలో పురోగతిని సాధిస్తారు. వ్యక్తిగతంగా మీకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరగడంతో పాటు, డబ్బు సంపాదనకు అన్నిమార్గాలు తెరుచుకుంటాయి. ఇది కుంభ రాశి వారికి నాలుగు నెలలపాటు ఉండే అదృష్టం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications