మూడు రాశులకు శని కుజుడు ప్రభావంతో ముంచుకొస్తున్న ప్రమాదం
గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి జీవితాలలోనూ గణనీయమైన మార్పులు వస్తాయి. జూన్ ఒకటవ తేదీన మధ్యాహ్నం 3: 27 నిమిషాలకు కుజుడు మేషరాశి లోకి వెళ్లి జూలై 12వ తేదీ వరకు మేషరాశిలోనే ఉంటున్నాడు. ఇక ప్రస్తుతం కుంభ రాశిలో శని ఉన్నాడు. కుంభరాశిలో ఉన్న శని మేష రాశిలో ఉన్న అంగారకుడిపై మూడవ కోణాన్ని చూపుతోంది.
అంగారకుడిపై శని యొక్క మూడవ అంశం
అంగారకుడిపై శని యొక్క మూడవ అంశం కొన్ని రాశి చక్రాల వారికి కష్టాలను తెచ్చిపెడుతుంది. వారు అనేక ఆర్ధిక నష్టాలను, ఊహించని కష్టాలను ఎదుర్కొంటారు. శని కుజుడు ప్రభావంతో ప్రమాదంలో పడుతున్న ఆ రాశులను గురించి ప్రస్తుత మనం తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కుజగ్రహంపై శని యొక్క మూడవ అంశం కారణంగా కర్కాటకరాశి జాతకులకు పెను ప్రమాదమే పొంచి ఉంది. మీరు ఆర్థికనష్టాన్ని భరించవలసి ఉంటుంది. ఆదాయ వనరులు కూడా బాగా తగ్గుతాయి. మీరు అనేక విషయాలను గురించి ఆందోళన చెందే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగం చేసే చోట సమస్యలను ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో గొడవలు వస్తాయి. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. వర్తక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కాదు.
కన్యారాశి
కన్యా రాశి జాతకులకు శని అంగారకుడి ప్రభావం సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో మీరు శారీరకంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో శత్రువులు మీపై పై చేయి సాధిస్తారు. మీరు అప్పులపాలయ్యే అవకాశం కూడా ఉంది. ఉద్యోగాలు చేసే వాళ్ళు ఆఫీసులలో తప్పులు చేసే అవకాశం ఉంది.
తులారాశి
అంగారకుడుపై శని యొక్క మూడవ అంశం తులా రాశి వారికి ప్రతికూలమైన, హానికరమైన ఫలితాలను ఇస్తుంది. తులా రాశి జాతకుల కుటుంబాలలో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి పంచాయతీలు చోటుచేసుకుంటాయి. అవివాహితులు తమ వైవాహిక జీవితంలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సమయంలో పని ఒత్తిడి ఉంటుంది. ఈ సమయం చాలా నిరాశ జనకంగా ఉంటుంది. పొరపాటున కూడా ఎక్కడా డబ్బులు ఇన్వెస్ట్ చేయకూడదు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఎక్కడ ఉండాలి? -
జన్మ నక్షత్రం పుబ్బ, ఉత్తర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
today rashiphalalu: తల్లి వైపు నుంచి డబ్బులు అందుతాయి -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
జన్మ నక్షత్రం ఆశ్లేష, మఖ ఉన్నవారి మే నెల జాతక ఫలం -
వాస్తును పాటిస్తే నిజంగానే ఆర్థికంగా కలిసొస్తుందా? రుజువులున్నాయా? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!












Click it and Unblock the Notifications