బుధ కుజుల దశాంక యోగం.. నేటినుండి వీరు పట్టిందల్లా బంగారం!

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితంపై ప్రభావం ఉంటుంది అనే విషయం తెలిసిందే. గ్రహాలు సంచారం చేసేటప్పుడు, సంయోగం జరిపి కొన్ని శుభ యోగాలను కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఇక సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 8.52నిముషాలకు అంగారకుడు మరియు బుధుడు ఒకదానికొకటి 36 డిగ్రీల వద్ద ఉండడం వల్ల దశాంక యోగం ఏర్పడింది.

బుధ కుజుల కారణంగా దశాంక యోగం
ప్రస్తుతం కుజుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. రెండు గ్రహాలు ఒకదానికి ఒకటి 36 డిగ్రీల కోణీయ స్థానంలో వచ్చి దశాంక యోగాన్ని ఏర్పరిచాయి. ఈ దశాంక యోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వారు అన్ని విధాల లబ్ధిని పొందుతారు.

dashank yoga with mars and mercury from today these zodiac signs will get wealth and happiness

కన్యారాశి
దశాంక యోగం కారణంగా కన్యారాశి జాతకులు సానుకూల ఫలితాలు పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. కన్య రాశి జాతకులకు ధన,ధాన్య వృద్ధి జరుగుతుంది. ప్రతి రంగంలోనూ ఈ సమయంలో విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా కన్యారాశి జాతకులు పురోగతిని సాధిస్తారు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించడానికి ఇది సరైన సమయం.

తులారాశి
తులారాశి జాతకులు దశాంకయోగం కారణంగా అన్ని విధాల లబ్ధిని పొందుతారు. ఈ సమయంలో వీరు ఏ రంగంలో పనిచేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. ఆరోగ్యం విషయంలో కూడా ఈ సమయంలో మంచి జరుగుతుంది. సోదరులతో, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఇప్పుడు మీరు ఏ పని చేపట్టినా విజయవంతమవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

మకర రాశి
మకరరాశి జాతకులు బుధ కుజుల కారణంగా ఏర్పడిన దశాంక యోగంతో సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. చాలాకాలంగా కష్టపడి పని చేస్తున్నటువంటి పనులు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. సమాజంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువులపైన ఈ సమయంలో వీరు విజయం సాధిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+