Horoscope today: నేడు వీరికి డబ్బుల పంట ఖాయం చేసిన ముఖ్య గ్రహాలు!
జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల సంచార ప్రభావం అన్ని రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. నవ గ్రహాలు ఒకరాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఆయా రాశుల వారికి శుభ, అశుభ ఫలితాలను ఇస్తాయి. డిసెంబర్ 25వ తేదీన కూడా ముఖ్య గ్రహాల రవాణా అన్ని రాశులవారి జీవితాన్ని మార్చేస్తుంది. కొన్ని రాశులవారికి సానుకూల ఫలితాలు వస్తే, మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి.
మేషం (Aries):
మేషరాశి జాతకులకు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లభిస్తాయి. ఆర్థికంగా లాభ సూచనలు ఉన్నాయి.. నేడు మేషరాశి జాతకులు కుటుంబ సభ్యుల సహకారం పొందుతారు.

వృషభం (Taurus):
వృషభ రాశి జాతకులు నేడు ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. అనవసర వాదనలు దూరంగా ఉంచితే మేలు జరుగుతుంది . ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
మిథునం (Gemini):
నేడు మిధునరాశి జాతకులు మంచి వార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.
కర్కాటకం (Cancer):
కర్కాటక రాశి జాతకులకు ఉద్యోగ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఓర్పుతో వ్యవహరిస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కనుక నేడు ఓర్పుతో పనులు చెయ్యండి.
సింహం (Leo):
సింహరాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్త పనులకు అనుకూల సమయం.
కన్య (Virgo):
కన్యా రాశి వారి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా ఉండవచ్చు. కాబట్టి కన్యా రాశి వారు జాగ్రత్త
తుల (Libra):
తులారాశి వారికి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. ప్రేమ సంబంధాల్లో స్పష్టత వస్తుంది.ఇది నేడు వీరికి మంచి సమయం.
వృశ్చికం (Scorpio):
వృశ్చిక రాశి వారికి అనుకోని లాభాలు అందుతాయి. పెట్టుబడులకు అనుకూల రోజుగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో సంయమనం పాటించాలి.
ధనుస్సు (Sagittarius):
ధనుస్సు రాశి వారికి ప్రయాణ యోగం ఉంది. విద్యార్థులకు శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగ మార్పు ఆలోచనలు ఫలిస్తాయి.
మకరం (Capricorn):
మకరరాశి వారికి నేడు బాధ్యతలు పెరుగుతాయి. క్రమశిక్షణతో పనిచేస్తే విజయం సాధిస్తారు.వీరికి అన్ని విషయాలలో లబ్ది జరుగుతుంది.
కుంభం (Aquarius):
కుంభరాశి వారికి నేడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సృజనాత్మక రంగాల్లో విజయం సాధిస్తారు.
మీనం (Pisces):
మీనరాశి వారికి నేడు ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్య సూచనలు ఉన్నాయి. మీనరాశి వారికి అన్ని విధాలా మంచి జరుగుతుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications