horoscope today: త్రిగ్రాహి యోగంతో ఈ రాశుల పంట పండుతుంది!
డిసెంబర్ 28వ తేదీ ఆదివారం నాడు వివిధ ముఖ్య గ్రహాలు వివిధ రాశులలో సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల వారి జీవితంలో సంచలన మార్పులు వస్తాయి. ముఖ్యంగా నేడు గురువు, కుజుడు, శుక్రుడు కలిసి త్రి గ్రహ యోగాన్ని ఏర్పరచడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇక నేటి ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషం
మేష రాశి వారికి ఈ రోజు చేపట్టే పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది.

వృషభం
వృషభ రాశి వారు నేడు సానుకూల ఫలితాలను చూస్తారు. ఉద్యోగ రంగంలో వీరికి అంతా అనుకూలంగా ఉంటుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
మిథునం
మిధున రాశి వారికి కొత్త పరిచయాలు లాభదాయకంగా మారతాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. నిర్ణయాలు స్పష్టంగా తీసుకుంటారు.
కర్కాటకం
కర్కాటక రాశి జాతకులకు మనసులో ఉన్న సందేహాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
సింహం
సింహ రాశి వారికి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.
కన్య
కన్యా రాశి వారికి పనుల్లో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. సహనం అవసరం. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించాలి.
తుల
తులారాశి జాతకులు స్నేహితుల సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృశ్చికం
వృశ్చిక రాశి వారు ఆకస్మిక లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతారు. నేడు కుటుంబంలో శుభవార్తలు వినిపిస్తాయి.
ధనుస్సు
ధనస్సు రాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నేడు ఉద్యోగం, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది.
మకరం
మకర రాశి జాతకులు కష్టానికి తగిన ఫలితం చూస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వహిస్తారు. ఇది మకర రాశి వారికి శుభ సమయం.
కుంభం
కుంభ రాశి వారు అదృష్ట జాతకులు అవుతారు. వీరిలో సృజనాత్మక ఆలోచనలు వెలుగులోకి వస్తాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది.
మీనం
మీనరాశి జాతకులకు ఆర్థికంగా లాభదాయకమైన రోజు. కుటుంబంతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications