నాలుగు అద్భుత రాజయోగాలతో వీరికి ఈ నెలంతా ధనలక్ష్మీ కటాక్షమే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ నెలలో అనేక ఖగోళ దృగ్విషయాలు చోటు చేసుకోబోతున్నాయి. అక్టోబర్ మాసంలో శని దేవుడు, బృహస్పతి, రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు గ్రహాల గమనంలో మార్పు వలన అనేక రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఇక అక్టోబర్ మాసంలో ముఖ్య గ్రహాల గమనం కారణంగా అనేక యోగాలు ఏర్పడుతున్నాయి.
అక్టోబర్ లో రాజయోగాలు
శని కుంభరాశిలో వక్ర దిశలో ప్రయాణం చేయడం వల్ల శశరాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా బుధుడు భద్రరాజ యోగాన్ని, శుక్రుడు మాలవ్య రాజయోగాన్ని, బుధుడు శుక్రుడు కలిసి లక్ష్మీనారాయణ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. అక్టోబర్ నెలలో ఇన్ని రాజయోగాల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి అనేక ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి . వీరి జీవితం ఈ రాజయోగాల కారణంగా అద్భుతంగా ఉంటుంది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి అక్టోబర్ నెల అదృష్టాన్ని ఇచ్చేనెలగా చెప్పవచ్చు. ఈ నెలలో వృషభ రాశి జాతకులు వారు ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రయోజనాలను, అతిపెద్ద విజయాలను పొందుతారు. వృషభ రాశి వారికి ఈ నెలలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో వృషభ రాశి వారి కెరీర్ బాగుంటుంది. ఇది వీరికి నిజంగా అదృష్టాన్ని ఇచ్చే నెల.
సింహరాశి
సింహరాశి జాతకులకు అక్టోబర్ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. అక్టోబర్ నెలలో సింహ రాశి జాతకులు నూతన ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. కెరీర్ లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో వీరికి నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఈ నెలలో జరిగే రాజయోగాల కారణంగా వీరికి అదృష్టం వరిస్తుంది. వీరు ఏ పని చేసినా అవాంతరాలు లేకుండా పని పూర్తవుతుంది.
తులారాశి
తులారాశి జాతకులకు అక్టోబర్ మాసం వివిధ రాజయోగాల కారణంగా అదృష్టమాసంగా మారుతుంది. అక్టోబర్ నెలలో తులారాశి జాతకులు బంపర్ ప్రయోజనాలను పొందుతారు. తుల రాశిలో ఏర్పడే మాలవ్య రాజయోగం కారణంగా వీరికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వీరి జీవితంలో సంతోషం, సంపద పెరుగుతాయి. నూతన ఉద్యోగాలను పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కొత్త ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications