శని జయంతి నాడు ఇవి చెయ్యండి.. మీ జీవితంలో జరిగే అద్భుతాలకు మీరే సాక్షి
హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం, అలానే వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహానికి చాలా విశిష్టత ఉంటుంది. శనిని క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతారు. శనిని న్యాయ దేవతగా పూజిస్తారు. మనకు సహనాన్ని ఇవ్వడంలోనూ శని ప్రత్యేకమైన పాత్ర పోషిస్తారు. నవగ్రహాలలో శని అత్యంత ప్రభావవంతమైన గ్రహం. అటువంటి శని పుట్టినరోజు జూన్ 6.. శని జయంతి రోజున కొన్ని పనులు చేస్తే శని దేవుడి కటాక్షం మీపై తప్పనిసరిగా ఉంటుంది.
శని జయంతి రోజు ఇలా చెయ్యండి
శని జయంతి రోజున శని దేవుడిని పూజించాలి అనుకునేవారు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి, ఉపవాస దీక్షను ఆచరించి, సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. శనీశ్వరుని ఆలయానికి వెళ్లి శనీశ్వరుని విగ్రహానికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయాలి .ఆయన ముందు ఆవనూనెతో దీపాన్ని వెలిగించాలి . నీలి పువ్వులు, నల్ల నువ్వులను నీళ్లలో వేసి శని దేవుడికి సమర్పించాలి.

శని జయంతి నాడు ఈ దానాలు మంచిది
శని దేవుడికి సంబంధించిన జపతపాలను, హోమాలను చేసినా శని దేవుడి కటాక్షం ఉంటుంది. శని జయంతి నాడు శని దేవుడికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను దానం చేస్తే మంచిది అలానే నల్ల సునకానికి ఈరోజు ఆహారం పెట్టినా శని దేవుడి కటాక్షం లభిస్తుంది. శని జయంతి రోజు దానాలు చేయలేని వారు కనీసం చీమలకు చక్కెర పెట్టిన మంచి జరుగుతుంది.
శని చాలా పవర్ ఫుల్.. భక్తితో పూజించండి
శని దేవుడి అశుభ దృష్టి పడితే ఎలాంటి వారైనా ఇబ్బందులను ఎదుర్కోవలసిందే. సాక్షాత్తు పరమశివుడు అంతటివాడే శనీశ్వరుని నుండి తప్పించుకోవడానికి చెట్టు తొర్రలో దూరాల్సి వచ్చిందని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు శని జయంతి చాలా ముఖ్యమైన రోజు కాబట్టి శని జయంతి రోజున శనిని భక్తితో పూజించండి. శని దయతో మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.
శని జయంతి నాడు ఇలా చేస్తే కుటుంబంలో సంతోషం
శని జయంతి నాడు రావి చెట్టు ముందు మొత్తం తొమ్మిది ఆవాల నూనె దీపాలను వెలిగించిన వారికి ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఇంట్లో పిల్లలు సంతోషంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఎదగాలంటే శని జయంతి రోజున శని దేవాలయానికి వెళ్లి నల్ల నువ్వులు సమర్పించాలి. ఇక ఇలా చేయడం వల్ల పిల్లలే కాదు కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. శనిదేవుడి వల్ల మన జీవితాలలో ఏర్పడే ప్రతికూలతలు శని జయంతి రోజు చేసే పూజల వల్ల, దానాల వల్ల, వివిధ చర్యల వల్ల తొలగిపోతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications