జాతకంలో బృహస్పతి బలం పెరగాలంటే, ఐశ్వర్యం రావాలంటే గురువారం ఇలా చెయ్యండి!!
జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే వారు అనుకున్నవన్నీ చేయగలుగుతారు. బృహస్పతి బలంగా ఉన్నవారికి ఆర్థిక పురోగతి కలుగుతుంది. విద్యా, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, సొంతిల్లు ఇలా అన్ని అనుకూలతలు బృహస్పతి మంచి స్థానంలో ఉన్నప్పుడు కలుగుతాయి. అయితే జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నవారు బృహస్పతి అనుగ్రహం పొందాలంటే గురువారం రోజు కొన్ని పూజలు చేయాలి. కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి.
గురుబలం కోసం గురువారం ఇలా చెయ్యండి
జాతకంలో బృహస్పతి బలోపేతం కావాలంటే గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, ధ్యానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించి ఆపై శ్రీమహావిష్ణువును పూజించాలి. ఇలా చేయడం వల్ల అన్ని పనులలోను విజయం లభిస్తుంది. అంతేకాదు శ్రీమహావిష్ణువు అనుగ్రహం కారణంగా గురుబలం పెరుగుతుంది.

గురువారం ఈ రంగు పూలు, పండ్లు, వస్త్రాలు విష్ణువుకు సమర్పించాలి
గురువారం రోజు శ్రీమహావిష్ణువుని పసుపు రంగు పూలతో పూజించాలి. శ్రీమన్నారాయణనుడికి పసుపు రంగు పూలన్నా, పండ్లన్నా, వస్త్రాలన్నా ఎంతో ఇష్టం. వీటిని స్వామి వారికి సమర్పించి పవిత్రమైన మనసుతో పూజాధికాలు చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని 108 సార్లు మంత్రాన్ని జపించి నిష్ఠతో పూజించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో బృహస్పతి బలోపేతం అవుతుంది.
విష్ణుమూర్తి అనుగ్రహంతో గురుబలం పెరిగి జీవితంలో సకల శుభాలు సమకూరుతాయి.
స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటే గురుబలం పెరుగుతుంది
ఇక జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నవారు గురుబలం పెరిగి సకల ఐశ్వర్యాలు కలగాలంటే స్నానం చేసే నీళ్లలో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇక ఈ పరిహారం చేయడం ద్వారా ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం అన్నీ కలుగుతాయి. గురువారం రోజు అరటి చెట్టును పసుపు, కుంకుమలతో పూజిస్తే కూడా అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. శ్రీమహావిష్ణువు ఆశీర్వాదంతో జాతకంలో గురుబలం పెరుగుతుంది.
గురువారం ఈ వ్రతం చేస్తే గురు బలం పెరుగుతుంది
ఎవరైతే గురువారం రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని వ్రత విని ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారి జాతకంలో గురుబలం పెరుగుతుంది. అంతేకాదు పసుపు రంగు వస్తువులను, పదార్ధాలను దానం చేసినా జాతకంలో బృహస్పతి బలం పెరుగుతుంది. కాబట్టి జాతకంలో బృహస్పతి బలం పెరగాలంటే కచ్చితంగా గురువారం రోజు ఈ నియమాలను పాటించి తీరాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications