వినాయక చవితి నాడు ఈ తప్పులు చేస్తే పేదరికం పక్కా!

ఆగస్ట్ 27వ తేదీన వినాయక చవితి పండుగను జరుపుకోవడానికి దేశం మొత్తం సిద్ధమైంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి నాడు వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటాం. ఆ రోజున ప్రతి ఒక్కరూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆదిదేవుడు అయిన వినాయకుడిని పూజించి వారి జీవితంలో వచ్చే విఘ్నాలు తొలగిపోయి, శుభాలు జరగాలని ప్రార్థిస్తారు.

వినాయక ప్రతిష్ట విషయంలో ఈ తప్పు చెయ్యొద్దు
వినాయక చవితి పండుగ రోజు వినాయకుడిని పూజించేవారు, వినాయకుని ప్రతిష్ట సమయంలో కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. మరి అవేమిటో తెలుసుకుందాం. వినాయకుడిని ప్రతిష్టించే దిశ విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఈశాన్యం వైపు, ఉత్తరం వైపు పెట్టడం మంచిది. ఈ దిశలో వినాయకుడిని ప్రతిష్టించడం వల్ల సానుకూలశక్తి ఇంట్లో వ్యాపిస్తుంది. మన జీవితంలో ఉండే ప్రతికూలతలు తొలగిపోతాయి. సరైన దిశలో వినాయకుడిని పెట్టకపోతే అనవసరమైన కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.

don t do these mistakes in vinayaka puja it will lead to poverty

వినాయకుడిని ఇలా పెడుతున్నారా?
చాలామంది వినాయకుడిని ప్రతిష్టించే అప్పుడు నేలపైన ప్రతిష్టిస్తారు. అలా అస్సలు చేయకూడదు. వినాయకుడిని పెట్టేటప్పుడు ఏదైనా పీట పైన కానీ, ఏదైనా వస్త్రం పైన కానీ ప్రతిష్టించాలి వస్త్రం పైన వినాయకుడిని పెట్టాలనుకుంటే ఎరుపు వస్త్రం కానీ, పసుపుపచ్చ వస్త్రం కానీ వేసి దానిపైన వినాయకుడిని ప్రతిష్టించాలి.

విగ్రహం విషయంలో ఇలా ఉంటె ప్రతికూలతలు
వినాయకుడి విగ్రహం విషయంలో జాగ్రత్తలు తీసుకోరు. సరిగ్గా పూర్తిగా తయారీ లేనటువంటి విగ్రహాన్ని, లేదా ఎక్కడైనా విరిగిపోయిన విగ్రహాన్ని పెట్టి పూజ చేయకూడదు. చేస్తే ప్రతికూలతలను ఎదుర్కోవలసి వస్తుంది. వినాయకుడి విగ్రహం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎక్కువ విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారా
చాలామంది వినాయకుడిని ఆరాధించేటప్పుడు తమ ఇంట్లో ఉన్న వినాయకుడి విగ్రహాలు అన్నింటినీ పెట్టి పూజలు చేస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. కేవలం ఒకే ఒక వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి వినాయక చవితి పూజ చేసుకోవాలి. అలా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

వినాయక చవితికి వీటితో పూజ చెయ్యకూడదు
ఇక చాలామంది వినాయకుడి పూజలు తెలిసి తెలియక కొన్ని రకాల పుష్పాలను ఉపయోగిస్తారు. ఇంకా తులసీ దళాలను, కేతకి పుష్పాలను వినాయకుడికి పెట్టడం మంచిది కాదు. ఇక దక్షిణావర్తి శంఖాన్ని వినాయక చవితి రోజు ఊదకూడదు. ఇలా చేస్తే ప్రతికూలతలను ఎదుర్కోవలసి వస్తుంది. అనవసరంగా జీవితంలో కష్టాలను చూడవలసి వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+