ముఖ్యమైన పనులకు.. ఏ నక్షత్రం రోజు ఏ పనిచేస్తే మంచిదో తెలుసుకోండి!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్రాలు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని చెబుతున్నారు. ఏవైనా ముఖ్యమైన పనులు చేయాలి అనుకున్నప్పుడు ఏ రోజు ఏ పని చేయాలి? ఏ నక్షత్రం సమయంలో ఏ పని చేయాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏ నక్షత్రం రోజు ఏ పని చేయాలో తెలిస్తే ఆ పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ప్రస్తుతం మనం ఆ వివరాలను తెలుసుకుందాం.
అశ్విని నక్షత్రం నామకరణ, అన్నప్రాసన, గృహప్రవేశ, వివాహాలకు మంచిది.
భరణి నక్షత్రం శ్రార్ధ కర్మలకు, మంత్రశాస్త్ర అధ్యయనాలకు మంచిది.
కృత్తికా నక్షత్రం విత్తనాలు చల్లడానికి, మొక్కలు నాటడానికి మంచిది.
రోహిణి నక్షత్రం పెళ్లిళ్లు చేయడానికి ఇంటి పనులు చేయడానికి ఇతర అన్ని పనులకు మంచిది.
మృగశిర నక్షత్రం అన్ని పనులకు మంచిది.
ఆరుద్ర నక్షత్రం నూతులు తవ్వడానికి, మంత్ర ప్రయోగాలకు, శివ పూజకు మంచిది.

పునర్వసు నక్షత్రం అన్నప్రాసన శుభకార్యాలకు మంచిది. పెళ్లిళ్లకు మాధ్యమంగా ఉంటుంది.
పుష్యమి నక్షత్రం పెళ్లిళ్లకు, గృహప్రవేశాలకు మంచిది.
ఆశ్లేష నక్షత్రం యంత్ర పనిముట్ల ప్రారంభానికి మంచిది.
మఖా నక్షత్రం ప్రయాణాలకు, శుభకార్యాలకు మంచిది.
పుబ్బ నక్షత్రం నూతులు తవ్వడానికి, విత్తనాలు చల్లడానికి మంచిది.
ఉత్తర నక్షత్రం పెళ్లిళ్లకు, ఇతర అన్ని పనులకు మంచిది.
హస్తా నక్షత్రం గృహప్రవేశానికి తప్ప అన్ని ఇతర పనులకు మంచిది.
చిత్తా నక్షత్రం వివాహాలకు, విద్యా ప్రారంభానికి, గృహప్రవేశానికి మంచిది.
స్వాతి నక్షత్రం పెళ్లిళ్లు వంటి అన్ని శుభకార్యాలకు మంచిది.
విశాఖ నక్షత్రం నూతులు తవ్వడానికి, మంత్ర ప్రయోగాలకు మంచిది.
అనురాధ నక్షత్రం పెళ్లిళ్లకు, ఉపనయనానికి ఇతర అన్ని శుభకార్యాలకు మంచిది.
జేష్ఠా నక్షత్రం నూతులు తవ్వడానికి, ప్రయాణాలకు మంచిది.
మూలా నక్షత్రం పెళ్లిళ్లకు. ఉపనయనాలకు, ప్రయాణాలకు మంచిది.
పూర్వాషాడ నక్షత్రం నూతులు తవ్వడానికి మంచిది.
ఉత్తరాషాడ నక్షత్రం అన్ని పనులకు మంచిది.
శ్రవణం నక్షత్రం గృహప్రవేశాలకు తప్ప అన్ని ఇతర పనులకు మంచిది.
ధనిష్ట నక్షత్రం వ్యాపార పనులకు, యంత్రాల వినియోగానికి, పెళ్లిళ్లకు మంచిది.
శతభిషా నక్షత్రం నూతులు తవ్వడానికి, అన్ని పనులకు మంచిది.
పూర్వాభాద్ర నక్షత్రం విద్యా ప్రారంభానికి, నూతులు తవ్వడానికి మంచిది.
ఉత్తరాభాద్ర నక్షత్రం అన్ని పనులకు మంచిది.
రేవతి నక్షత్రం పెళ్లిళ్లు, ఉపనయనాలు, యాత్రలు మొదలైన వాటికి మంచిది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!!












Click it and Unblock the Notifications