వరలక్ష్మీ వ్రతం రోజు నుండి ఈ రాశులవారికే లక్ష్మీ కటాక్షం!
అత్యంత ఇష్టంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం త్వరలోనే రాబోతోంది. ఆగస్టు 8వ తేదీన వరాలిచ్చే చల్లని తల్లి అయిన వరలక్ష్మీదేవిని అందరూ విశేషంగా పూజిస్తారు. ఇక వరలక్ష్మీ వ్రతం రోజున గురు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది. ఆగస్టు ఎనిమిదో తేదీన వరలక్ష్మీ వ్రతం రోజు అదృష్టవంతులు అవుతున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశి వారికి వరలక్ష్మీ వ్రతం నుండి అదృష్టం కలిసి వస్తుంది. గురువు, శుక్రుడు, కుజుడు ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇవ్వనున్నారు. వీరు ఈ సమయంలో అనేక మార్గాలలో ఆదాయాన్ని గడిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి.

మిధున రాశి
మిధున రాశి వారు వరలక్ష్మీ వ్రతం రోజు నుండి అదృష్ట జాతకులు అవుతున్నారు. మిధున రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. షేర్లలో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి. విదేశీ సంపాదన అందుతుంది. మీరు ఈ సమయంలో అనేక మార్గాలలో ఆదాయాన్ని సమకూర్చుకుంటారు.
సింహరాశి
సింహ రాశి వారికి వరలక్ష్మీ వ్రతం నుండి సానుకూల ఫలితాలు ఉంటాయి. సింహ రాశి వారు సంపన్నులు కావడానికి మార్గం సుగమమవుతుంది. వృత్తి వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. సింహ రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసిన సఫలమవుతుంది. షేర్లలో పెట్టుబడులు పెట్టే వారికి కలిసొస్తుంది.
కన్యారాశి
కన్యారాశి జాతకులకు వరలక్ష్మీ వ్రతం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. ఇది అన్ని విధాల శుభదాయకంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి వరలక్ష్మీ వ్రతం రోజు నుంచి అదృష్టం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో వివిధ మార్గాల నుండి ఆదాయం సంపాదిస్తారు. ఎప్పటినుంచో వసూలు కావలసిన మొండి బాకీలు వసూలు అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ లు లాభాలను ఇస్తాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఇది అన్ని విధాల వృశ్చిక రాశి వారికి అనుకూల సమయం.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి వరలక్ష్మీ వ్రతం నుండి బాగుంటుంది. వీరికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వృత్తి వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం జరుగుతుంది.
కుంభరాశి
వరలక్ష్మీ వ్రతం నుండి కుంభ రాశి వారికి కలిసి వస్తుంది. పెద్దగా ప్రయత్నం చేయక పోయినప్పటికీ ఆదాయం వస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వడ్డీ వ్యాపారాలు చేసే కుంభ రాశి వారికి కలిసొస్తుంది. షేర్లలో పెట్టుబడులు పెట్టే వారికి కూడా మంచి సమయం. లక్ష్మీదేవి కుంభరాశి వారి ఇంట్లో తాండవిస్తుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications