నేటినుండి వీరికి జాక్ పాట్.. రొట్టె విరిగి నేతిలో పడుతుంది!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 3వ తేదీన బృహస్పతి మరియు శుక్రుడు 60 డిగ్రీల దూరంలో ఉంటారు. ఇక ఈ ఖగోళ పరిణామం కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తుంది. సంపదలకు, ప్రేమకు, విలాసాలకు కారకుడైన శుక్రుడు ప్రతీ నెల తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఇక నవంబర్ మాసంలో శుక్రుడు దాని త్రికోణరాశి అయిన తులా రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు తులారాశిలోకి సంచారం చేయడం మాలవ్య రాజయోగాన్ని ఏర్పరుస్తుంది.
గురు శుక్రుల కేంద్ర దృష్టి యోగం
అదే విధంగా శుక్రుడు నవంబర్ మూడవ తేదీన దేవతల గురువైన బృహస్పతితో కలిసి కేంద్ర దృష్టి యోగాన్ని ఏర్పరుస్తాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. నవంబర్ మూడవ తేదీ ఉదయం 4.44 నిమిషాలకు శుక్రుడు మరియు బృహస్పతి ఒకరికొకరు 60 డిగ్రీల దూరంలో ఉండడం వల్ల ఏర్పడే కేంద్ర యోగంతో లబ్ది పొందే ఆ రాశులను గురించి తెలుసుకుందాం.

మేషరాశి
కేంద్ర దృష్టియోగం కారణంగా మేషరాశి జాతకులకు కలిసి వస్తుంది. బృహస్పతి మూడవ ఇంట్లో, శుక్రుడు ఏడవ ఇంట్లో మేషరాశిలో సంచరించడం వల్ల కేంద్ర దృష్టియోగం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రయాణాల నుంచి ఫలితాలను పొందుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిస్తారు. మతపరమైన ప్రయాణాలను చేస్తారు. కెరీర్ లోను, పనిలోనూ విజయాలను సాధిస్తారు. వ్యాపారరంగంలో గణనీయమైన లాభాలను పొందుతారు.
మిధునరాశి
గురు శుక్ర కేంద్రయోగం మిధునరాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో శుక్రుడు ఐదవ ఇంట్లో, బృహస్పతి రెండవ ఇంట్లో సంచారం చేయడం వల్ల కేంద్ర దృష్టియోగం ఏర్పడుతుంది. ఇది ఈ రాశివారికి డబ్బుపరంగా లాభాలను చేకూరుస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వర్ధక వ్యాపారాలలో ప్రయోజనాలను పొందుతారు. భవిష్యత్తులో మంచి లాభాలను పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని పెంపొందించుకుంటారు.
మీనరాశి
శుక్రుడు ఎనిమిదవ ఇంట్లోనూ, బృహస్పతి ఐదవ ఇంట్లోను సంచరించడం వల్ల మీనరాశిలో కేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా మీనరాశి జాతకులకు పూర్వీకుల నుండి ఆస్తులు వస్తాయి. విద్యారంగంలో ప్రయోజనాలు చేకూరుతాయి. కళలకు సంబంధించిన వ్యక్తులు ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగస్తుల జీవితాలలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పోతాయి. స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. మీనరాశి జాతకులు పొదుపు చేయడంలో కూడా విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications